Advertisementt

'పిడుగు' ఫస్ట్ లుక్ లాంచ్!

Wed 11th Nov 2015 10:34 PM
pidugu movie first look launch,vineeth,ashok goti,ramamohan  'పిడుగు' ఫస్ట్ లుక్ లాంచ్!
'పిడుగు' ఫస్ట్ లుక్ లాంచ్!
Advertisement

వినీత్, మోనికా సింగ్ జంటగా వి2 ఫిల్మ్స్ ప్రై||లి|| పతాకంపై అశోక్ గోటి నిర్మిస్తున్న చిత్రం 'పిడుగు'. ఈ చిత్రంతో రామమోహన్.సి.హెచ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను బుధవారం హైదరాబాద్ లోని మంత్రి మహేందర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, వీరశంకర్ కలిసి విడుదల చేసారు. ఈ సందర్భంగా..

దర్శకుడు రామమోహన్ మాట్లాడుతూ.. ''అశోక్ గోటి గారు వైజాగ్ లో ప్రముఖ వ్యాపారవేత్త. సినిమాలపై ఆసక్తితో వారి కుమారుడ్ని హీరోగా పెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. వినీత్ నటనలో, డాన్సుల్లో శిక్షణ తీసుకున్నాడు. 'పిడుగు' మంచి కంటెంట్ ఉన్న కథ. హీరో క్యారెక్టరైజేషన్ లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఆ పాత్రలో వినీత్ అవలీలగా నటించాడు. కొత్త పాయింట్ తో కమర్షియల్ ఫార్మాట్ లో సినిమా ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ యాబై రోజుల్లో కంప్లీట్ చేసాం. అశోక్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.'' అని చెప్పారు.

వినీత్ మాట్లాడుతూ.. ''పిడుగు' అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిలిం. సినిమాలో ఐదు పాటలు. ఐదు ఫైట్స్ ఉంటాయి. చాలా వేరియేషన్స్ ఉన్న సినిమా. పెద్ద బడ్జెట్ లో తీసాం. ఒక ఎస్టాబ్లిష్డ్ హీరో చేయాల్సిన కథ కాని నన్ను నమ్మి డైరెక్టర్ గారు నాతో చేసారు. నటునిగా అన్ని జోనర్స్ లో సినిమాలు చేయాలనుంది. సినిమా షూటింగ్ పూర్తయింది'' అని చెప్పారు. 

అశోక్ గోటి మాట్లాడుతూ.. ''సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మా ప్రొడక్షన్ లో వస్తున్న మొదటి సినిమా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాను'' అని చెప్పారు.

మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ''రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రావీణ్యం గల అశోక్ గారు ఈ సినిమాతో నిర్మాతగా మారడం ఆనందంగా ఉంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా. మంచి విజయం సాధించి అశోక్ గారు మరిన్ని చిత్రాలు నిర్మించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు. 

వీరశంకర్ మాట్లాడుతూ.. ''అశోక్ గారు పది నుండి పదిహేను మంది దగ్గర కథలు విన్నారు. రామమోహన్ గారు చెప్పిన కథ నచ్చడంతో ఓ కొత్త టాలెంట్ ను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఆయనకు దర్శకత్వం చేసే అవకాసం ఇచ్చారు. వినీత్ కు ఈ చిత్రంతో నటునిగా మంచి పేరు రావాలని ఆశిస్తున్నాను'' అని చెప్పారు 

పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ''సినిమా మంచి సక్సెస్ కావాలి. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

ఈ చిత్రానికి ఆర్ట్: వెంకటేష్.ఆర్, మాటలు: రమేష్ రాయ్, పాటలు: భాస్కర్ భట్ల, అనంతశ్రీరాం, శ్రీమణి, వరికుప్పల యాదగిరి, సంగీతం: కార్తిక్, విజయ్ కురాకుల, ఫోటోగ్రఫీ: పి.ఎస్.ప్రకాష్, ఎడిటర్: కార్తిక్ శ్రీనివాస్, నిర్మాత: అశోక్ గోటి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రామమోహన్.సిహెచ్.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement