సినిమాల్లో కథానాయకుడు ఏ పేరుతో సందడి చేయబోతున్నాడన్న విషయం గురించి అభిమానులు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆసక్తి కనబరుస్తుంటారు. ఆ పేరు ఎంత క్యాచీగా ఉందో, ఎంత మాసీగా ఉందో ఆరా తీస్తుంటారు. కొన్నిసార్లు ఆ క్యారెక్టర్ పేరునే సినిమాకీ నిర్ణయిస్తుంటారు. అందుకే ముందస్తుగానే సినిమాలో తమ కథానాయకుడు ఏ పేరుతో కనిపిస్తారో ఆరా తీస్తుంటారు అభిమానులు. కథానాయకులు వాళ్ల సొంత పేరుతోనే తెరపై కనిపిస్తారని తెలిస్తే ఇక అభిమానుల ఆనందానికి అవధులుండవు. అలా ఇప్పుడు మహేష్ అభిమానులు ఆనందపడే సమయం వచ్చింది. తన కొత్త సినిమా బ్రహ్మోత్సవంలో మహేష్ మహేష్‌గానే కనిపించబోతున్నాడట. ఆ విషయం గురించి చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. అయితే ఫిల్మ్‌నగర్ జనాలు మాత్రం ఆ వార్త పక్కా అంటున్నారు.
మహేష్ తెరపై ఇదివరకెప్పుడూ తన సొంత పేరుతో సందడి చేసింది లేదు. ఆయన్ని ఇంట్లో ముద్దుగా నాని అని పిలుస్తుంటారు. ఆ ముద్దుపేరుతో ఓ సినిమా కూడా చేశాడు. ఇక ఆ తర్వాత ఎప్పుడూ తన సొంత పేరుతో సినిమా చేయలేదు. బ్రహ్మోత్సవంలో మాత్రం మహేష్‌ని మహేష్‌గానే చూపించబోతున్నాడట దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. సహజంగా సినిమాలు తీసే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. కథ రీత్యానే మహేష్‌ని ఆయన సొంత పేరుతోనే చూపించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. `బ్రహ్మోత్సవం`లో మహేష్‌కి ఆరు మంది మరళ్లుంటారని తెలిసింది. మరి మరదళ్ల పేర్లు ఎలా ఉంటాయో చూడాలి.