కళానిలయ క్రియేషన్స్ బ్యానర్ సమర్పణలో సిద్ధాంశ్(గాయకుడు ఫేం), రాహుల్, తేజస్విని హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'సినీ మహల్'. లక్ష్మణ్ వర్మ దర్శకత్వంలో బి.రమేష్ నిర్మాతగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సినిమా ఆడియో వేడుకను నవంబర్ 21న సినీ ప్రముఖుల సమక్షంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా...
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ''సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవంబర్ 21న ఆడియో విడుదల చేస్తున్నాం. సలోని చేసిన ప్రత్యేకగీతంతో పాటు శేషు, షకలక శంకర్ సహా పలువురు కమెడియన్స్ తో చిత్రీకరించిన కామెడి సాంగ్, శేఖర్ చంద్ర సంగీతం, దొరై కె.సి.వెంకట్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అవుతాయి. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖుల హాజరవుతారు. అలాగే డిసెంబర్ నెలలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నాం'' అని అన్నారు.
దర్శకుడు లక్ష్మణ్ వర్మ మాట్లాడుతూ.. ''నేను ఈరోజు దర్శకుడుగా ఇక్కడ నిలబడి ఉన్నానంటే కారణం పార్థుగారు, సినీ మహల్ రాజుగారు, కళానియ ప్రొడక్షన్స్ బ్యానర్. ఇది ఒక మినీ మోడ్రన్ మహా భారతాన్ని పోలిన కథ. ఇందులో శ్రీకృష్ణుడిగా సిద్ధాంశ్ చేస్తే, అర్జునుడిగా రాహుల్ నటించాడు. శకుని పాత్రలో జెమిని సురేష్, పాంచాలి పాత్రలో తేజస్విని నటించారు. తప్పకుండా డిఫరెంట్‌గా ఉండి, అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. శేఖర్ చంద్ర మంచి సంగీతం అందించారు. నవంబర్ 21న ఆడియో విడుదల చేసి, డిసెంబర్‌లో సినిమాను విడుద చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని అన్నారు.
సత్య, గొల్లపూడి మారుతీరావు, జీవా, జెమిని సురేష్ తదితయి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దొరై కె.సి.వెంకట్, సంగీతం: శేఖర్ చంద్ర, ఎడిటర్: ప్రవీణ్‌పూడి, కళ: గోవింద్, సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ, చైతన్యకృష్ణ,హనుమాన్, నిర్మాత: బి.రమేష్, సహ నిర్మాతలు: పార్థు, బాలాజీ, మురళీధర్, కో-డైరెక్టర్: వాసు, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: లక్ష్మణ్ వర్మ.