Advertisementt

'శివగంగ' ఆడియో విశేషాలు!

Sun 08th Nov 2015 12:59 PM
siva ganga movie,sreeram,roy lakshmi,vadi udayan,srinivasa reddy  'శివగంగ' ఆడియో విశేషాలు!
'శివగంగ' ఆడియో విశేషాలు!
Advertisement
Ads by CJ

శ్రీరామ్, రాయ్ లక్ష్మి, సుమన్ ప్రధాన పాత్రల్లో వి.సి.వడి ఉడయాన్ దర్శకత్వం వహించిన చిత్రం 'శివ గంగ'. ఈ చిత్రాన్ని కె.శివనాథ్, శ్రీనివాస రెడ్డి నిర్మాతలుగా తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. హొమ్ మినిస్టర్ నాయిని నరసింహారెడ్డి బిగ్ సీడీను, ఆడియో సీడీలను ఆవిష్కరించి మొదటి కాపీను మంత్రి జగదీశ్ రెడ్డికి అందించారు. ఈ సందర్భంగా..

నాయిని నరసింహారెడ్డి మాట్లాడుతూ.. ''సినిమా ట్రైలర్, సాంగ్స్ బావున్నాయి. మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ''యూనిట్ అందరికి నా శుభాకాంక్షలు. సినిమా మంచి విజయం సాధించాలి'' అని చెప్పారు.

తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ''ఈ సంవత్సరం తెలుగు సినిమాలకు బాగా కలిసొచ్చింది. విడుదలయిన ప్రతి సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంటున్నాయి. ఈ సినిమా కూడా అదే కోవలోకి వస్తుందని భావిస్తున్నాను. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా సక్సెస్ అయితే నిర్మాతలు మరిన్ని సినిమాలు చేయడానికి ముందుకొస్తారు. కాబట్టి కొత్త నిర్మాతలను ప్రోత్సహించాలని ప్రేక్షకులను కోరుతున్నాను'' అని చెప్పారు.

నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ''సినిమా ట్రైలర్ చూసి థ్రిల్ ఫీల్ అయ్యాను. ప్రస్తుతం హారర్ సినిమాల ట్రెండ్ కొనసాగుతుంది. ఈ సినిమా కూడా మంచి హిట్ కావాలని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

దర్శకుడు వి.సి.వడి ఉడయాన్ మాట్లాడుతూ.. ''ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈ చిత్రాన్ని రూపొందించాం. ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది. నాకు సపోర్ట్ చేసిన ఆర్టిస్టులకు, సాంకేతిక నిపుణులకు నా థాంక్స్'' అని చెప్పారు.

రాయ్ లక్ష్మి మాట్లాడుతూ.. ''టీం అంతా ఎఫర్ట్ పెట్టి చేసిన సినిమా. ఇప్పటివరకు నేను హారర్ చిత్రాల్లో నటించాను. మొదటిసారిగా దయ్యం పాత్రలో కనిపించనున్నాను. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ బాగా కుదిరింది'' అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ జాన్ పీటర్ మాట్లాడుతూ.. ''ఒక దయ్యం రివెంజ్ తీర్చుకుంటే ఎలా ఉంటుందనేదే ఈ సినిమా. డైరెక్టర్ గా గారు చాలా చక్కగా తీర్చిదిద్దారు. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

నిర్మాత శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ''సినిమా పెద్ద విజయం సాధిస్తుందని భావిస్తున్నాను. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

శ్రీరామ్ మాట్లాడుతూ.. ''నాకు శ్రీరామ్ అని పేరు పెట్టి 'రోజాపూలు' చిత్రంతో తెలుగు సినిమా ఇండస్ట్రీకు పరిచయం చేసిన బృందంతో మరోసారి పని చేసే అవకాసం రావడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాను. రాయ్ లక్ష్మి గొప్ప నటి. ఈ సినిమాలో చాలా బాగా నటించింది. నిర్మాతకు ఈ చిత్రంతో మంచి లాభాలు రావాలి'' అని చెప్పారు.

ఈ చిత్రానికి ఫైట్స్: కణల్ కన్నన్, కెమెరా: ఎస్.శ్రీనివాస రెడ్డి, మాటలు: ఎం.రాజశేఖర్ రెడ్డి, పాటలు: వనమాలి, వెలిదండల్, ఎడిటర్: ఎలీసా, ఆర్ట్: దేవరాజ్, నిర్మాతలు: కె.శివనాథ్, శ్రీనివాస రెడ్డి, దర్శకుడు: వి.సి.వడి ఉడయాన్. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ