మోహన్-మైనా జంటగా బైలుపాటి మోహన్ ఆర్ట్ ప్రొడక్షన్ పతాకంపై బి.మోహన్ నిర్మిస్తున్న చిత్రం 'ఒక్కడితో మొదలైంది'. ఈ చిత్రానికి మొగిలి నాగేశ్వరరావు దర్శకుడు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా..
బి.మోహన్ మాట్లాడుతూ.. ''తెలుగు ఇండస్ట్రీ అంటే నాకు చాలా ఇష్టం. నేను కన్నడ కు చెందినా తెలుగు సినిమాతోనే తెరంగేట్రం చేయాలని భావించాను. సినిమాపై ప్యాషన్ తో ఈ చిత్రాన్ని రూపొందించాను. ఈ సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేసిన ధనరాజ్ గారు మాకు అన్ని విధాల సహకరించడంతోపాటు మాకు తెలియని ఎన్నో విషయాలను చెప్పేవారు. బోలే అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్ అవుతుంది. డైరెక్టర్ నాగేశ్వరావు గారు అనుకున్న సమయానికి చిత్రాన్ని పూర్తి చేసారు. రివెంజ్, లవ్, థ్రిల్లర్ ఇలా అన్ని ఎలిమెంట్స్ కలగలిపిన చిత్రమిది. ముగ్గురు యువకులు వారు అనుకున్న లక్ష్యాలను చేరుకునే సమయంలోఎలాంటి పరిస్థితులను ఎడుర్కొన్నారనేదే ఈ సినిమా కథ. ఈ నెల 20 న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
దర్శకుడు మొగిలి నాగేశ్వరావు మాట్లాడుతూ.. ''ఒక నిస్సాయకుడైన అన్నకళ్ళముందు తన చెల్లికి దారుణం జరిగితే అతను వాళ్ళపై ఏ విధంగా కక్ష తీర్చుకున్నాడు అనే అంశంపై కథ నడుస్తుంది. వరంగల్ లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. కామెడీ, యాక్షన్, సస్పెన్స్ తో సాగే థ్రిల్లర్ తో అనుక్షణం ప్రేక్షకులను ఉత్తేజ పరుస్తూ ఉత్కంట కలిగిస్తూ ఉంటుంది. భోలే మంచి మ్యూజిక్ ఇచ్చారు'' అని చెప్పారు.
సుమన్, లావణ్య, అనూషా, చెమ్మక్ చంద్ర తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్యాంప్రసాద్ దూపటి, కథ: నవీన్ రాజ్ సి.హెచ్, సంగీతం: బోలే శావలి, నిర్మాత: బి.మోహన్, దర్శకత్వం: మొగిలి నాగేశ్వరరావు.