Advertisementt

అబ్బే, నేనేం మూర్ఛపోలేదు: అఖిల్

Sun 08th Nov 2015 12:17 PM
akhil,akhil shooting,akhil first song  అబ్బే, నేనేం మూర్ఛపోలేదు: అఖిల్
అబ్బే, నేనేం మూర్ఛపోలేదు: అఖిల్
Advertisement
Ads by CJ

ఆరంగేట్రం సినిమా కోసం అక్కినేని అఖిల్ ఎంతలా కష్టపడి పోయాడో పాపం దర్శకుడు వినాయక్ మాటల్లో కూడా సరిగ్గా చెప్పలేకపోయాడు. అఖిల్ సినిమాలోని ఫస్ట్ సాంగు కోసం పన్నెండు రోజులు తిండి, నిద్దర లాంటివి మానేసి సెట్స్ మీదే డ్యాన్సు ప్రాక్టీస్ చేస్తూ తీవ్రంగా శ్రమించి ఓరోజు ఏకంగా స్పృహ తప్పి మూర్ఛ పోయాడని వినాయక్ ఎంత క్యాజువలుగా చెప్పాడంటే మీడియా మొత్తం ఈ విషయాన్ని హెడ్ లైన్సులో  పెట్టేసి మరీ చిన్నోడి కష్టాన్ని మ్యాగ్నిఫై చేసింది. ఈ విషయంలో అందరికీ అఖిల్ శ్రమ పట్ల ఓ సింపతీ జనరేట్ అయ్యే విధంగా సాగింది మీడియా తంతు.

కానీ అఖిల్ మాత్రం, అబ్బే నేనేం మూర్ఛపోలేదు... జస్ట్ గిడ్డీగా ఫీలయ్యాను అంతే... కాస్త విశ్రాంతి తీసుకుని మళ్ళీ షూటింగ్ యదావిధిగా కానిచ్చేసాము... ఇంట్లో కూడా ఈ విషయం రెండు రోజుల దాకా చెప్పలేదు, అంటూ అసలు సంగతి మెల్లిగా సెలవిచ్చాడు. ఇప్పుడిప్పుడే మీడియా ముందు అలవాటు పడుతున్నాడుగా, అటు దర్శకుడు ఏం చెప్పాడో సరిగ్గా తెలుసుకోకుండా వినాయక్ ఇచ్చిన సాఫ్ట్ సింపతి మొత్తాన్ని అవసరంలేనట్టుగా ఒక్క సంజాయిషీతో కొట్టి పారేసాడు అఖిల్. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ