Advertisementt

ఉద్యానవనం 2 మూవీ ప్రారంభం!

Sat 07th Nov 2015 08:16 PM
udhyanavanam2 movie,sravan bapatla,sreenivas mandha,krishna teja  ఉద్యానవనం 2 మూవీ ప్రారంభం!
ఉద్యానవనం 2 మూవీ ప్రారంభం!
Advertisement
Ads by CJ

శ్రీ గాయత్రి ఫిలింస్‌ బ్యానర్‌పై కృష్ణతేజ, గౌరీశంకర్‌, మనీషా చటర్జీ హీరో హీరోయిన్లుగా నూతన చిత్రం 'ఉద్యానవనం 2' శనివారం హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. 'సారీ..పార్ట్‌1 ఇంకా తీయలేదు' అనేది ట్యాగ్‌లైన్‌. శ్రావణ్‌ బాపట్ల దర్వకత్వంలో శ్రీనివాస్‌ మంథా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణా ట్రాన్స్‌పోర్ట్‌ మినిష్టర్‌ మహేందర్‌ రెడ్డి క్లాప్‌ కొట్టి, కెమెరా స్విచ్చాన్‌ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...

దర్శకుడు శ్రావణ్‌ బాపట్ల మాట్లాడుతూ.. ''దర్శకుడిగా నా రెండో చిత్రమిది. కొంత గ్యాప్‌ తీసుకుని మంచి కథతో 'ఉద్యానవనం2' చిత్రంతో మీ ముందుకు వస్తున్నాను. నిర్మాత శ్రీనివాస్‌ మంథాగారు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. మంచి స్క్రిప్ట్‌ కుదిరింది. సాధారణంగా పార్క్‌ అంటే చాలా మంది వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు. అటువంటి వ్యక్తుల బావోద్వేగాల కలయికే ఈ చిత్రం. ఇందులో పార్క్ పై ఒక సాంగ్‌ను కూడా రాయిస్తున్నాం. సస్పెన్స్‌ థ్రిల్లర్ విత్‌ కామెడి ఎంటర్‌టైనింగ్‌ మూవీ. మంచి టీం కుదిరింది'' అని అన్నారు.

నిర్మాత శ్రీనివాస్‌ మంథా మాట్లాడుతూ.. ''నిర్మాతగా నా రెండో చిత్రం. దర్శకుడు కథ చెప్పగానే ఎగ్జైట్‌మెంట్‌గా అనిపించింది. ఈ నవంబర్‌ 16 నుండి సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకుంటుంది. మంచి టీంతో రూపొందుతోన్న డిఫరెంట్‌ ఎంటర్‌టైనర్‌'' అని అన్నారు.

కృష్ణతేజ మాట్లాడుతూ.. ''హీరోగా నేను చేస్తున్న రెండో సినిమా. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్‌'' అని అన్నారు.

గురుకిరణ్‌ మాట్లాడుతూ.. ''ఈ చిత్రంలో వన్‌ ఆఫ్‌ ది హీరోగా చేస్తున్నాను. దర్శకుడు శ్రావణ్‌గారు మంచి కాన్సెప్ట్‌ తో రూపొందిస్తున్నారు. డిఫరెంట్‌ లవ్‌స్టోరి. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్‌'' అని అన్నారు.

సంగీత దర్శకుడు సత్యకశ్యప్‌ మాట్లాడుతూ.. ''ఈ చిత్రంలో నాలుగు పాటలుంటాయి. మ్యూజిక్‌కు మంచి స్కోప్‌ ఉన్న సినిమా. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్'' అని అన్నారు.

ఈ కార్యక్రమంలో హీరోయిన్‌ మనీషా చటర్జీ, త్రిభువన్‌ సహా చిత్రయూనిట్‌ సభ్యులు పాల్గొని దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేశారు.

రచ్చరవి, ఫణి, ఆటో రాంప్రసాద్‌, గాలిపటాల సుధాకర్‌, విజయ్‌ రాంప్రసాద్‌ సుప్రియ, త్రిభువన్‌, నవీన, సాహితీ, స్నేహ, అనగ, మాస్టర్‌ నిఖిల్‌ తదితరులు ఇతర తారాగణం. 

ఈ చిత్రానికి కెమెరా: వి.సత్యానంద్‌, ఆర్ట్‌: విజయ్‌కృష్ణ, మ్యూజిక్‌: సత్య కశ్యప్‌, డ్యాన్స్‌: సి.హెచ్‌.గోవింద్‌, ఫైట్స్‌: లంకా సాంబశివరావు, ఎడిటింగ్‌: బి.మహేంద్రనాథ్‌, పాటు: శ్రావణ్‌ బాపట్ల, లంకా సాంబశివరావు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కల్లెపల్లి భాస్కర్‌, ప్రొడ్యూసర్‌: శ్రీనివాస్‌ మంథా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రావణ్‌ బాపట్ల.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ