రుద్ర, వెన్నెల, సంజయ్ ప్రధాన పాత్రల్లో దుగ్గిన్ సమర్పణలో శివకృతి క్రియేషన్స్ బ్యానర్‌పై ఎం.వి.సాగర్ దర్శకత్వంలో కెల్లం కిరణ్‌కుమార్ నిర్మించిన చిత్రం 'వీరి వీరి గుమ్మడిపండు'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశిరావు బిగ్ సీడీని,ఆడియో సీడీలను విడుదల చేసి తొలి కాపీను దర్శకుడు ఎం.వి.సాగర్, నిర్మాత కెల్లం కిరణ్‌కుమార్ కు అందించారు. ఈ సందర్భంగా..
రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ.. ''సినిమాలో పాటలు బావున్నాయి. పి.ఆర్. మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను నిర్మించిన దర్శక నిర్మాతలకు, యూనిట్ సభ్యులకు నా అభినందనలు'' అని చెప్పారు.
దర్శకుడు ఎం.వి.సాగర్ మాట్లాడుతూ.. ''ఇదొక ఫ్యామిలీ హారర్ ఎంటర్టైనింగ్ చిత్రం. కొంత మంది 63 కొత్త ఆర్టిస్టులు ఈ చిత్రానికి పనిచేశారు. పి.ఆర్. మంచి సంగీతాన్నందించారు. అందరి సపోర్ట్‌తో సినిమాను అనుకున్న సమయంలోనే పూర్తి చేశాం. నిర్మాత కిరణ్‌కుమార్‌గారి సపోర్ట్ లేకపోతే సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది'' అని అన్నారు.
చలపతిరావు మాట్లాడుతూ.. ''ఇదొక ఫ్యామిలీ హర్రర్ ఎంటర్‌టైనర్ అంటున్నారు. నాకు చూడాలనే ఆసక్తి పెరిగింది. సాగర్ మంచి కథతోనే సినిమా తీసుంటాడని అనుకుంటున్నాను'' అని అన్నారు.
మధురశ్రీధర్ మాట్లాడుతూ..''ప్రతి పాట కథలో భాగంగా ఉంది. ఇదొక మంచి స్టొరీ. దర్శక నిర్మాతలకు యూనిట్ సభ్యులకు అభినందనలు'' అని అన్నారు.
నిర్మాత కెల్లం కిరణ్‌కుమార్ మాట్లాడుతూ.. ''సినిమా అంటే ప్యాషన్ ఉన్న యూనిట్ ఈ సినిమా కోసం వర్క్ చేసింది. సినిమా బాగా వచ్చింది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది'' అని అన్నారు.
రుద్ర మాట్లాడుతూ.. ''నన్ను నమ్మి, కథకు నేను న్యాయం చేస్తానని నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. మూవీలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది'' అని అన్నారు.
సంగీత దర్శకుడు పి.ఆర్. మాట్లాడుతూ.. ''మంచి మ్యూజిక్ కుదిరింది. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్'' అన్నారు.
ఈ కార్యక్రమంలో సంజయ్, బంగారం, వెన్నెల, కెమెరామెన్ కె.యం.కృష్ణ, లైన్ ప్రొడ్యూసర్ కవిత తదితరులు పాల్గొన్నారు.
రుద్ర, వెన్నెల, సంజయ్, బంగారం హార్దిక్, రుషిత, రఘుబాబు, శివన్నారాయణ, దీక్షిత్, అనంత్, ప్రవీణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటర్: శక్తి స్వరూప్, మ్యూజిక్: పి.ఆర్, సినిమాటోగ్రఫీ: కె.యం.కృష్ణ, ప్రొడ్యూసర్: కెల్లం కిరణ్‌కుమార్, దర్శకత్వం: ఎం.వి.సాగర్.