యస్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీమతి సరిత తిరువీధుల సమర్పణలో సుధాకర్ తిరువీధుల సహ నిర్మాతగా హేరీ ఫెర్నాండెజ్ దర్శకత్వంలో భోజ్‌పురిలో అఖండ విజయం సాదించిన 'ఆజ్ కే కరణ్ అర్జున్' చిత్రాన్ని నిర్మాత ఆర్.కె. 'నేటి విజేతలు'గా తెలుగులోకి అనువదించారు.
ఈ చిత్రం గురించి నిర్మాత ఆర్.కె. మాట్లాడుతూ... ''అద్భుతమైన పోరాటాలతో తొమ్మిది పాటలతో అందర్నీ అలరించేలా ఈ చిత్రం ఉంటుంది. రెండు ఐటమ్స్ సాంగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. యాక్షన్ కామెడీ మ్యూజిక్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. చిత్రం క్వాలిటీని చూసి క్రేజీ ఆఫర్ ఇచ్చి కొనడం జరిగింది. గీతామాధురి, శ్రీకృష్ణ, దీపు, ఉమా నేహ, శ్రీకాంత్, గాయత్రిలతో పాటలు పాడించాం. పాటల చిత్రీకరణ స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు ధీటుగా ఉంటుంది. కరుణాకర్ మంచి సంగీతం అందించారు. ఆర్‌కె రాసిన మాటలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. భోజ్‌పురిలో సూపర్‌స్టార్స్ దినేష్‌లాల్, ప్రవేశ్‌లాల్ మంచి పెర్ఫామెన్స్ ఇచ్చారు. హీరోయిన్లుగా పాకిహెగ్డే, క్రిషా ఖండేల్కర్ నటించారు. నీలిమాసింగ్, సీమాసింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. భోజ్‌పురిలోనే కాకుండా ఉత్తరాదిలో అద్భుత విజయం సాదించిన 'నేటి విజేతలు' చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. నవంబర్ రెండో వారంలో ఆడియోను విడుదలచేసి, అదే నెలాఖరులో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.