పవన్ సిద్ధు, కామ్నా సింగ్, నిషిత ప్రధాన పాత్రల్లో యాని క్రియేషన్స్ పతాకంపై కిరణ్ కుమార్ దర్శకత్వంలో గంటా రామకృష్ణ నిర్మించిన చిత్రం 'అయ్యో రామా'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. చింతల రామచంద్రారెడ్డి బిగ్ సీడీను, ఆడియో సీడీలను ఆవిష్కరించి మొదటి కాపీను తుమ్మలపల్లి రామసత్యనారాయణ కు అందించారు. ఈ సందర్భంగా..
చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ''ట్రైలర్, సాంగ్స్ బావున్నాయి. టైటిల్ క్యాచీగా ఉంది. సినిమా మంచి విజయం సాధించాలి. చిత్ర బృందానికి నా అభినందనలు. ఇలాంటి వినోదాత్మక చిత్రాలు మరిన్ని రావాలని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.
సాయి వెంకట్ మాట్లాడుతూ.. ''యూనిట్ అందరికి నా అభినందనలు. సినిమా టైటిల్ బావుంది. కిరణ్ అధ్బుతమైన టెక్నాలజీను ఉపయోగించి పెద్ద చిత్రంగా తెరకెక్కించారు. రిచ్ లొకేషన్స్ లో సినిమా తీసారు. మ్యూజిక్ బావుంది. సినిమా ఖచ్చితంగా మంచి విజయాన్ని సాధిస్తుంది'' అని చెప్పారు.
రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ''సినిమాలో ఫ్రెష్ లుక్ ఉంది. 2015వ సంవత్సరం తెలుగు ఇండస్ట్రీకు బాగా కలిసొచ్చింది. అన్ని చిత్రాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఈ సినిమా కూడా అదే కోవలోకి రావాలని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.
నిర్మాత గంటా రామకృష్ణ మాట్లాడుతూ.. ''మా చిత్రంలోని పాటలు శ్రోతలను అలరిస్తాయని బావిస్తున్నాను. ఇదొక కామెడీ ఎంటర్టైనింగ్ మూవీ. సంతోష్ కవల చక్కటి సంగీతాన్ని అందించారు. సినిమాలో మొత్తం నాలుగు పాటలున్నాయి'' అని చెప్పారు.
దర్శకుడు కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ''నాపై ఉన్న నమ్మకంతో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా రామకృష్ణ గారు ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా బాగా వచ్చింది. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్'' అని చెప్పారు.
మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ మాట్లాడుతూ.. ''కొత్త వాళ్ళమైనా మమ్మల్ని నమ్మి ఈ అవకాసం ఇచ్చిన నిర్మాతకు థాంక్స్'' అని చెప్పారు.
పవన్ సిద్ధు మాట్లాడుతూ.. ''నన్ను నమ్మి సినిమా తీసిన దర్శకనిర్మాతలకు, నన్ను ప్రోత్సహించిన తల్లితండ్రులకు ధన్యవాదాలు. అందరం స్నేహితుల్లా కలిసి ఈ సినిమా చేసాం. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో బిజెపి సెక్రటరీ రంగారెడ్డి, శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి, సునీల్ కుమార్ రెడ్డి, కామ్నా సింగ్, నిషిత తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి కథ-మాటలు: రాజేష్ కుమార్ ముదునూరి, సినిమాటోగ్రఫీ: పవన్-విజయ్, ఎడిటర్: అనిల్ రాజ్, మ్యూజిక్: సంతోష్ కవల, నిర్మాత: గంటా రామకృష్ణ, దర్శకుడు: కిరణ్ కుమార్.