కమల్ హాసన్ స్పీడు మాములుగా లేదండోయ్. అరవయి ఒకటో సంవత్సరంలో అడుగుపెడుతున్న ఈ లోక నాయకుడు ఒకేసారి నాలుగైదు సినిమాల మీద కసరత్తు చేస్తున్నాడంటే అది మామూలు ఎనర్జీ కాదు. ఓ వైపు చీకటి రాజ్యం రిలీజుకు రెడీ అయిపోతే, మరో వైపు విశ్వరూపం 2 అలాగే అమల అక్కినేని హీరోయినుగా కమల్ హీరోగా మరో చిత్రం కూడా షూటింగుకు సిద్ధం అయిపోయాయి. ఇంతటితో ఆగకుండా కమల్ హాసన్ తన డ్రీం ప్రాజెక్టు ఒకటి అతితొందరలోనే స్టార్ట్ చేస్తున్నాడు.
రామాయణం ఆధారంగా రావణాసూరుడి పాత్రలో కమల్ హాసన్ హీరోగా లంకేశ్వర్ అనే అపూర్వమైన సినిమా ఒకటి తొందరలోనే సెట్స్ మీదకు వెళ్లనుందని కమల్ స్వయంగా వెల్లడించారు. లంకేశ్వరుడు అన్న టైటిల్ ఇంతకుమునుపే చిరంజీవి వందవ సినిమాకు వాడేసారు. దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర యావరేజుగా నిలచింది. మళ్ళీ అదే టైటిల్ ఇప్పుడు కమల్ హాసన్ పట్టుకోవడం, అదీ ఓ పౌరాణిక చిత్రానికి అవడం యాదృచ్చికం. కమల్ గారిని రావణుడి పాత్రలో చూడడం ఖచ్చితంగా గొప్ప అనుభూతిని ఇస్తుంది.