Advertisementt

మాంజ ఆడియో విశేషాలు..!

Tue 03rd Nov 2015 01:13 PM
maanka audio release,kishan,giridhar,avika gor  మాంజ ఆడియో విశేషాలు..!
మాంజ ఆడియో విశేషాలు..!
Advertisement
Ads by CJ

కిషన్ ఎస్ఎస్, అవికా గోర్, ఈషా డియోల్ ప్రధాన పాత్రల్లో రాజ్ కందుకూరి సమర్పణలో గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం మాంజ. కిషన్ ఎస్ఎస్ దర్శకుడు. ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. తమ్మారెడ్డి భరద్వాజ బిగ్ సీడీను, ఆడియో సీడీలను ఆవిష్కరించి మొదటి కాపీను దామోదర్ ప్రసాద్ కు అందించారు. ఈ సందర్భంగా..

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. కిషన్ తొమ్మిదవ ఏటలోనే ఫుట్ పాత్ సినిమాను తెరకెక్కించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నాడు. మరలా ఇప్పుడు తను డైరెక్ట్ చేసిన మాంజ ఆస్కార్ అవార్డు కు నామినేట్ అయింది. త్వరలోనే కిషన్ నేషనల్,ఇంటర్నేషనల్ స్టార్స్ తో ఓ ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని రూపొందించనున్నాడు. నిర్మాత గిరిధర్ ఫుట్ పాత్ చిత్రాన్ని తెలుగులో అనువదించాలనుకున్నాడు కాని కుదరలేదు. ఈ సినిమాతో నిర్మాతకు మంచి లాభాలు రావాలని ఆశిస్తున్నాను.. అని చెప్పారు.

దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇండియన్ సినిమా కిషన్ ను చూసి గర్వపడే స్థాయికి ఎదిగాడు. ఇంటర్నేషనల్ సినిమాలకు గ్రాఫిక్స్ కూడా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనకు మంచి సక్సెస్ రావాలి. టీం అందరికి ఆల్ ది బెస్ట్.. అని చెప్పారు.

దర్శకుడు కిషన్ మాట్లాడుతూ.. సినిమా అవుట్ పుట్ బాగా వచ్చింది. నవంబర్ 6న హాలీవుడ్ లో మాంజ అకాడమీ అవార్డ్స్ కు వెళ్లనుంది. ఇదొక ఎమోషనల్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమా. ఈ సినిమాలో అవికా నటనతో పాటు టెక్నికల్ విషయాలపై కూడా ఫోకస్ పెట్టింది. ఈ సినిమా చూసి రాజ్ కందుకూరి గారు దక్షిణాదిలో వచ్చిన స్లమ్ డాగ్ మిలియనీర్ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఈ చిత్రం కన్నడలో కేరాఫ్ ఫుట్ పాత్2 పేరుతో, హిందీలో కిల్ దెమ్ యంగ్ అనే పేరుతో రిలీజ్ అవుతున్నాయి. నవంబర్ చివరి వారంలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం పెద్ద బడ్జెట్ లో 3డి ఫార్మాట్ లో హిందీ, తెలుగు భాషల్లో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను.. అని చెప్పారు.

గిరిధర్ మాట్లాడుతూ.. అవికాతో లక్ష్మి రావే మా ఇంటికి సినిమా చేసే సమయంలో తనకు ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. బెంగుళూరు వెళ్లి వాళ్ళ షూటింగ్ చూసినప్పుడు తెరకెక్కించే విధానం నాకు చాలా నచ్చింది. కిషన్ సినిమా లైన్ చెప్పగానే ఎలా అయినా తెలుగులో నేనే రిలీజ్ చేయాలనుకున్నాను. ఎవరు టచ్ చేయని ఓ పాయింట్ తీసుకొని సినిమా చేసాడు. కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో ఒకేరోజు రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని కదిలించే సినిమా అవుతుంది. ఈ సినిమాతో కిషన్ కు మరిన్ని అవార్డ్స్ వస్తాయి.. అని చెప్పారు.

అవికా గోర్ మాట్లాడుతూ.. నన్ను నమ్మి ఓ చాలెంజింగ్ రోల్ లో నటించే అవకాసం ఇచ్చిన కిషన్ కు థాంక్స్. కిషన్ నుండి టెక్నికల్ గా చాలా నేర్చుకున్నాను. ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరించారు. ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది.. అని చెప్పారు.

రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ఇదొక స్పెషల్ ప్రాజెక్ట్. కమర్షియల్ వాల్యూస్ ఉన్న సినిమా. చైల్డ్ క్రిమినల్స్ కు సంబంధించిన చిత్రం. ఇలాంటి సినిమాలను ప్రోత్సహిస్తేనే మంచి చిత్రాలోస్తాయి.. అని చెప్పారు.

చల్లా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. కిషన్ లాంటి గొప్ప వ్యక్తితో కలసి పని చేయడం చాలా గర్వంగా ఉంది. ఇంత మంచి ప్రాజెక్ట్ లో ఓ పాట రాసినందుకు ఆనందంగా ఉంది. నేను రాసిన పాటను తెరపై విజువల్ గా చూస్తుంటే చాలా ఎమోషనల్ గా అనిపించింది. ఇంటెన్స్ ఉన్న సినిమా ఇది.. అని చెప్పారు.

సురేష్ గంగుల మాట్లాడుతూ.. ఈ సినిమాలో పాట రాసే అవకాశం ఇచ్చిన కిషన్ కు, శ్రీకాంత్ గారికి థాంక్స్.. అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో వీర శంకర్, డి.ఎస్.రావు, ప్రసన్న కుమార్, ప్రథాని రామకృష్ణ గౌడ్, ఎన్.శంకర్, రఘు కుంచె, బాబా సెహగల్, మల్టీ డైమెన్షన్ వాసు, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు.  

ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే: శ్రీకాంత్ హెచ్ఆర్, డైలాగ్స్: వంశి చంద్ర వట్టికుటి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ:మగేష్ కె దేవ్, ఎస్ కె రావు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: కిషన్ ఎస్ఎస్, మ్యూజిక్: వివేక్ కార్, మనోజ్ శ్రీహరి, కిషన్ ఎస్ఎస్, లిరిక్స్: డా. చల్లా భాగ్యలక్ష్మి, సురేష్ గంగుల, మ్యూజిక్ ప్రొడ్యూసర్: వినయ్ పాటిల్, ఎడిటింగ్ అండ్ డిఐ: మల్టిడైమెన్షన్ టెక్నాలజీస్, ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి, డైరెక్టర్: కిషన్ ఎస్ఎస్. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ