విజయ్, హన్సిక, శృతిహాసన్, శ్రీదేవి, సుదీప్ వంటి భారీ తారాగణంతో చింబుదేవన్ డైరెక్షన్‌లో వచ్చిన 'పులి' చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఫ్లాప్ అయింది. ఈ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు 8కోట్లు నష్టం వచ్చిందని చెన్నై ట్రేడ్ సమాచారం. ఓవర్ బడ్జెట్ వల్లే ఈ చిత్రానికి అంత నష్టం కావడానికి కారణం అంటున్నారు. టాక్ ఎలా ఉన్నా ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ సాదించడంతో ఆమాత్రమైనా నష్టాలు తగ్గాయని అంటున్నారు. ఇటీవల తనను కలిసిన ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు తన తదుపరి చిత్రం విషయంలో రికవరీ అయ్యేలా చేస్తానని విజయ్ హామీ ఇవ్వడంతో వారంతా సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది. విజయ్ తదుపరి చిత్రం డైరెక్టర్ అట్లీతో ఉంది. ఈ చిత్రం ద్వారా పులి సినిమాకు వచ్చిన నష్టాలను తీర్చే బాధ్యత విజయ్ తీసుకున్నందుకు అందరూ ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.