అనుష్క, ఆర్య, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రలో ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ప్రసాద్ వి.పొట్లూరి నిర్మిస్తున్న చిత్రం సైజ్ జీరో. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కె.రాఘవేంద్రరావు బిగ్ సీడీను, ఆడియో సీడీలను విడుదల చేసారు. ఈ సందర్భంగా..
ప్రకాష్ కోవెలమూడి మాట్లాడుతూ.. కనిక మంచి స్టొరీ ఇచ్చింది. డైరెక్టర్ గా నాకు ఫాంటసీ సినిమాలంటే ఇష్టం కాని కథ విన్న తరువాత సినిమా చేయాలనిపించింది. చిన్న సినిమాగా చేయాలని పివిపి ప్రసాద్ గారికి కథ చెప్తే స్టొరీ కు ఉన్న సత్తా చూసి పెద్ద బడ్జెట్ తోనే సినిమా చేయాలని ఆయన డిసైడ్ అయ్యారు. కీరవాణి గారితో మ్యూజిక్ చేయించాలనుకున్నాను. ఆయనకు కథ చెప్పిన వెంటనే నచ్చి బిజీ షెడ్యూల్ లో ఉన్న మ్యూజిక్ చేయడానికి ఓకే చెప్పారు. సాంగ్స్ బెస్ట్ ఆల్బం గా నిలిచాయి. అనంతశ్రీరాం, శ్రీమణి మంచి సాహిత్యాన్ని అందించారు. టెక్నీషియన్స్ అందరూ కష్టపడి పని చేసారు. అనుష్క లావుగా ఉన్న అందంగా కనిపించాలి. ఆ విషయంలో ప్రశాంతి గారు చాలా హెల్ప్ చేసారు. ఆర్య బిజీగా ఉన్న ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు. అనుష్క ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా ఉంది. ఈ సినిమాలో తన లుక్ కోసం బరువు పెరిగింది. తనలో ఎంతో డెడికేషన్ ఉంది. ఈ టీం తో మరిన్ని సినిమాలు చేయాలనుంది.. అని చెప్పారు.
రాజమౌళి మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా బావుంది. ట్రైలర్ చూసిన తరువాత సినిమా చూడాలనే ఇంటరెస్ట్ కలగాలి. ఆ విషయంలో ఈ సినిమా టీం గెలిచింది. ప్రకాష్ కంటే ముందు అనుష్క నాకు ఈ స్క్రిప్ట్ చెప్పింది. చాలా ఎగ్జైట్మెంట్ తో చెప్పింది. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు ఏ సినిమా గురించి తను ఇంత బాగా చెప్పలేదు. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అంటే బీద లుక్ తో ఆర్ట్ సినిమాను ట్రీట్ చేసినట్లు చేస్తారు. అలా చేయకుండా పెద్ద పెద్ద టెక్నీషియన్స్ తో, బిగ్ కాస్టింగ్ తో, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో కథను నమ్మి ఈ సినిమా చేస్తున్నారు. ప్రకాష్ తో పదిహేను సంవత్సరాలుగా అసోసియేషన్ ఉంది. సినిమాను నమ్మి నిజాయితీతో చేస్తాడు. కనిక మంచి స్టొరీ ప్రొవైడ్ చేసింది. వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది.. అని చెప్పారు.
అనుష్క మాట్లాడుతూ.. స్క్రిప్ట్ విన్నప్పుడు చాలా కనెక్ట్ అయ్యాను. నేను కూడా గడిచిన 10 సంవత్సరాల్లో బరువు పెరగడం తగ్గడం చేసాను. బరువు పెరిగినపుడు చాలా మంది ఇన్సెక్యుర్ గా ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కరు మనకున్న స్కిల్ లో కంఫర్టబుల్ గా ఉండాలి. అందరూ వ్యాయామం చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి. అదే సమయంలో లావుగా ఉన్నామని బాధపడకూడదు. ఈ సినిమాలో మంచి మెసేజ్ ఉంది. ప్రతి ఒక్క విమెన్ ఈ స్క్రిప్ట్ కు కనెక్ట్ అవుతారు. నేను ఈ సినిమాలో నటించగలనని నమ్మి ఈ అవకాసం ఇచ్చిన పివిపి గారికి ప్రకాష్ గారికి నా థాంక్స్. ప్రకాష్ గారు ఎలాంటి సినిమాలైనా చేయగలరు. కీరవాణి గారు జెన్యూన్ మ్యూజిక్ ఇచ్చారు. ప్రతి సాంగ్ అధ్బుతంగా ఉంటుంది. సోనాల్, ఆర్య ఈ సినిమాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.. అని చెప్పారు.
ఆర్య మాట్లాడుతూ.. పివిపి గారు నాకు బాగా సపోర్ట్ చేస్తారు. కీరవాణి గారు మంచి మ్యూజిక్ కంపోజ్ చేసారు. అనుష్క తో వర్ణ సినిమా తరువాత ఈ సినిమాలో నటిస్తున్నాను. బరువు పెరిగి నటించడమనేది మామూలు విషయం కాదు. టీం అందరికి పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.
కీరవాణి మాట్లాడుతూ.. రాఘవేంద్ర గారిలో ఎంత సంస్కారం, క్రమశిక్షణ ఉన్నాయో.. ప్రకాష్ లో కూడా ఉన్నాయి. ఎక్కడ క్రమశిక్షణ ఉంటుందో.. అక్కడ సక్సెస్ ఉంటుందనేది నేను నమ్మిన సత్యం. అనుష్క, పివిపి లేకపోతే ఈ సినిమా లేదు. ఈ సినిమాలో ఎటువంటి ఫైట్స్, ఐటెం సాంగ్స్ లేకపోయినా ఓ మంచి చిత్రాన్ని నిర్మించడానికి పివిపి గారు ముందుకొచ్చారు. అనుష్క లాంటి పెద్ద హీరోయిన్ ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్టు చేయడం గొప్ప విషయం.ఖచ్చితంగా సినిమా సక్సెస్ అవుతుంది.. అని చెప్పారు.
వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. కీరవాణి, ప్రకాష్, అనుష్క లాంటి వారు పని చేసిన చిత్రమిది. ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. పెద్ద సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది. టీం అందరికి ఆల్ ది బెస్ట్.. అని చెప్పారు.
అనుష్క, ఆర్య, భరత్, ఊర్వశి, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్ తదితరలు ప్రధాన తారాగణంగా నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిరవ్ షా, ఆర్ట్: ఆనంద్ సాయి, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, కాస్ట్యూమ్స్: ప్రశాంత్, కథ-స్క్రీన్ ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం, నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి, దర్శకత్వం: ప్రకాష్ కోవెలమూడి.