మహానటుడు అక్కినేని మనవడు, కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని ని హీరోగా పరిచయం చేస్తూ సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి సమర్పణలో యూత్‌స్టార్ నితిన్ నిర్మిస్తున్న భారీ చిత్రం అఖిల్. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని దీపావళి కానుకగా నవంబర్ 11న వరల్డ్‌వైడ్‌గా విడుదలవుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత నితిన్ మాట్లాడుతూ అఖిల్ అక్కినేని ని హీరోగా పరిచయం చేస్తూ వినాయక్‌గారి దర్శకత్వంలో మా శ్రేష్ఠ్ మూవీస్ బేనర్‌లో నిర్మించిన అఖిల్ చిత్రాన్ని నవంబర్ 11న దీపావళి కానుకగా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నాం. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అక్కినేని అభిమానుల్లో చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ వున్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగానే చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా చాలా భారీ ఎత్తున నిర్మించడం జరిగింది. అఖిల్ పెర్‌ఫార్మెన్స్ చాలా పెద్ద హైలైట్ అవుతుంది. అనూప్, థమన్ సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియో చాలా పెద్ద హిట్ అయింది. అన్ని పాటలూ సూపర్‌హిట్ అయి సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ బాగా పెంచాయి. అఖిల్ తొలి చిత్రంతోనే హీరోగా చాలా మంచి పేరు తెచ్చుకుంటాడు. అలాగే మా బేనర్‌కి అఖిల్ మరో సూపర్‌హిట్ మూవీ అవుతుంది' అన్నారు.
అఖిల్ అక్కినేని, సయేషా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, హేమలతోపాటు లండన్‌కు చెందిన లెబాగా జీన్, లూయిస్ పాస్కల్, ముతినే కెల్లున్ తనాక, రష్యాకు చెందిన గిబ్సన్ బైరన్ జేమ్స్ విలన్స్‌గా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి వెలిగొండ శ్రీనివాస్, కోన వెంకట్, అనూప్, థమన్, అమోల్ రాథోడ్, రవివర్మ, ఎ.ఎస్.ప్రకాష్, గౌతంరాజు, భాస్కరభట్ల, కృష్ణచైతన్య, శేఖర్, గణేష్, జాని సాంకేతిక నిపుణులు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్), సమర్పణ: నిఖితారెడ్డి, నిర్మాత: నితిన్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.