Advertisementt

కుమారి 21 F ఆడియో విశేషాలు!

Sun 01st Nov 2015 04:13 PM
kumari 21f audio launch,raj tarun,sukumar,hebha patel  కుమారి 21 F ఆడియో విశేషాలు!
కుమారి 21 F ఆడియో విశేషాలు!
Advertisement
Ads by CJ

సుకుమార్ రైటింగ్స్, అండ్ పీఏ మోషన్ పిక్చర్స్ పతాకంపై సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో సుకుమార్ సమర్పణలో విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి నిర్మిస్తున్న చిత్రం కుమారి 21 F. రాజ్ తరుణ్, హేభ పటేల్ హీరో హీరోయిన్లు. ఈ చిత్రం పాటల ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బిగ్ సీడీను, ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి కాపీను సురేందర్ రెడ్డి కి అందించారు. నిర్మాత దిల్ రాజు థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసారు. 

ఈ సందర్భంగా..

అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఇలాంటి సినిమా చేసినప్పుడు బడ్జెట్ అనేది చాలా కాంపాక్ట్ గా ఉంటుంది. దేవిశ్రీ వర్రీ అవ్వద్దని చెప్పి ఫ్రీ గా ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. రోబో, వన్ నేనొక్కడినే వంటి పెద్ద చిత్రాలకు పని చేసిన రత్నవేలు గారు ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా వర్క్ చేసారు. డబ్బు పక్కన పెట్టి సుకుమార్ మీద గౌరవంతో చాలా మంది రెమ్యునరేషన్ తీసుకోకుండా చేసారు. వాళ్ళందరికీ నా థాంక్స్. రాజ్ తరుణ్ ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలి. ఆర్య సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన ప్రతాప్ గారు ఈ సినిమాను డైరెక్ట్ చేసారు. సుకుమార్ గారితో నాకు మంచి రిలేషన్ ఉంది. ఐ యాం ది చేంజ్ అనే షార్ట్ ఫిలిం చేయడానికి ఎవరిని డైరెక్ట్ చేయమని అడగాలో అర్ధంకాక సుకుమార్ కు కాల్ చేసాను. వెంటనే చేయడానికి ఒప్పుకున్నాడు. అది మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం.. అని చెప్పారు.

సుకుమార్ మాట్లాడుతూ.. ప్రతాప్ లేకపోతే ఈ సినిమా లేదు. నాతో దగ్గరుండి స్క్రిప్ట్ రాయించాడు. తనకు మంచి భవిష్యత్తు ఉంది. నా ఇద్దరు ఫ్రెండ్స్ దేవిశ్రీ, రత్నవేలు నేను నిర్మాతగా సినిమా చేస్తున్నానని చెప్పిన వెంటనే ఇద్దరు రెమ్యునరేషన్ తీసుకోకుండా సంవత్సరం పాటు పని చేసారు. ఇండస్ట్రీ లో స్నేహం కృత్రిమమైనదని అందరు చెప్పుకుంటారు కాని నాకు మాత్రం మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. బన్నీ కి నేను ఎప్పుడు ఫోన్ చేసిన వెంటనే ఏం కావాలి అని అడుగుతాడు. నాకేం కావాలో సూటిగా తనను మాత్రమే అడగగలను. రాజ్, హేభ ఈ సినిమాలో బాగా నటించారు.. అని చెప్పారు.  

రత్నవేలు మాట్లాడుతూ.. ఆల్ ది బెస్ట్ టు కుమారి 21 F టీం. సుక్కు ఫీల్ ను ప్రతాప్ బాగా క్యారీ చేసాడు. సుక్కు లాంటి వారిని ఇప్పటి వరకు మీట్ కాలేదు. తను నాకు మంచి ఫ్రెండ్.. అని చెప్పారు. 

డైరెక్టర్ సూర్య ప్రతాప్ మాట్లాడుతూ.. దేవిశ్రీ గారితో కరెంటు సినిమాకు పని చేసాను. మరోసారి ఆయనతో పని చేయడం సంతోషంగా ఉంది. రాండీ సర్ నుండి చాలా నేర్చుకున్నాను. మేమంతా ఇంత కష్టపడి పని చేయడానికి కారణం సుకుమార్ గారే.. అని చెప్పారు.

రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. జగడం సినిమా నుండి సుకుమార్ గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలో హీరోగా చేయడం చాలా ఆనందంగా ఉంది. దేవి గారు పాటలకు డాన్సు చేస్తానని అనుకోలేదు. రాండీ గారు కెమెరా ముందు నుంచోవడం నా అద్రుష్టం. ప్రతాప్ గారు బాగా డైరెక్ట్ చేసారు.. అని చెప్పారు.

దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ.. సుకుమార్ మీద ప్రేమతోనే ఈ సినిమాకు పని చేసాను. మంచి సబ్జెక్టు. ఎఫర్ట్ పెట్టి వర్క్ చేసారు. సూర్య ప్రతాప్ గారితో గతంలో ఓ సినిమాకు పని చేసాను. మరోసారి పని చేయడం ఆనందంగా ఉంది. రత్నవేలు ఫోటోగ్రఫీ చాలా బావుంటుంది. సుక్కు మొదటిసారి ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా ఇది. మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. టీం అందరికి ఆల్ ది బెస్ట్.. అని చెప్పారు.

సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రేట్ టెక్నీషియన్స్ చేస్తున్న సినిమా. వాళ్ళు అనుకున్న సినిమాను బాగా తీసి ఉంటారు. అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుందని భావిస్తున్నాను. చిత్ర బృందానికి నా అభినందనలు.. అని చెప్పారు.

దిల్ రాజు మాట్లాడుతూ.. ప్రొడ్యూసర్ గా మారుతున్న సుకుమార్ కు ఆల్ ది బెస్ట్. ఆర్య సినిమా నుండి సుక్కు తో ట్రావెల్ చేస్తున్నాను. గొప్ప సినిమాలు తీస్తూ.. ప్రొడ్యూసర్ గా మారడం మామూలు విషయం కాదు. టాలెంట్ ఉంటే సక్సెస్ కావచ్చని చాలా మంది డైరెక్టర్స్ నిరూపించారు. ఆర్య సినిమాతో మా బ్యానర్ లో మొదట హిట్ ఇచ్చిన సుకుమార్ అదే బ్యానర్ లో నాతో ఎనిమిది మంది కొత్త దర్శకులను ఇంట్రడ్యూస్ చేసేలా చేసాడు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది.. అని చెప్పారు.  

బన్నీ వాసు మాట్లాడుతూ.. సుక్కు డైరెక్టర్ నుండి ప్రొడ్యూసర్ గా మారుతున్నాడు. తనకు ఈ సినిమా పెద్ద హిట్ కావాలని ఆశిస్తున్నాను.. అని చెప్పారు.

విక్రం, కిరణ్, రాజీవ్ కనకాల, భానుశ్రీ, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, నోయల్, హేమ తదితరులు పాల్గొన్నారు.

రాజ్‌తరుణ్, హేభ పటేల్, నోయల్, నవీన్, సుదర్శన్ రెడ్డి, భాను, హేమ, కమల్, తాగుబోతు రమేష్, జోగిబ్రదర్స్, సత్య, కృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రత్నవేలు, ఆర్ట్: బి.రామచంద్రసింగ్, ఎడిటర్: అమర్ రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, శంకర్, నిక్సన్, సమర్పణ: సుకుమార్,  నిర్మాతలు: విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి,కథస్కీన్‌ప్లే-మాటలు: సుకుమార్, దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ