Advertisementt

విశ్వనాదామృతంలో మెగాస్టార్‌, విక్టరీ.!

Sun 01st Nov 2015 03:32 PM
tv programme viswanadamrutham,tollywood celebrities in viswanadamrutham,chiranjeevi in viswanadamrutham,venkatesh in viswanadamrutham,tv series viswanadamrutham  విశ్వనాదామృతంలో మెగాస్టార్‌, విక్టరీ.!
విశ్వనాదామృతంలో మెగాస్టార్‌, విక్టరీ.!
Advertisement
Ads by CJ

సిరిసిరిమువ్వ, శంకరాభరణం, శ్రుతిలయలు, సిరివెన్నెల, స్వాతికిరణం, స్వరాభిషేకం వంటి సంగీత ప్రధాన చిత్రాలు, సాగరసంగమం, స్వర్ణకమలం వంటి నృత్య ప్రధాన చిత్రాలతోపాటు మరెన్నో సూపర్‌హిట్‌ చిత్రాలను రూపొందించిన కళాతపస్వి కె.విశ్వనాథ్‌ ఇప్పుడు బుల్లితెరపై ఒక ప్రత్యేక కార్యక్రమంలో కనిపించబోతున్నారు. విశ్వనాదామృతం పేరుతో ఈటీవీలో ప్రసారం కానున్న ఈ కార్యక్రమంలో కె.విశ్వనాథ్‌ చిత్రాల్లో పనిచేసిన నటులు, సాంకేతిక నిపుణులు తమ మధురానుభూతుల్ని తెలియజేస్తారు. 

ప్రతి ఆదివారం మధ్నాహ్నం 1.30 నుంచి 2.30 వరకు ప్రసారమయ్యే విశ్వనాదామృతంలో మెగాస్టార్‌ చిరంజీవి, విక్టరీ వెంకటేష్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, అల్లు అరవింద్‌, సిరివెన్నెల సీతారామశాస్త్రితోపాటు మరికొంతమంది తెలుగు చలనచిత్ర ప్రముఖులు పాల్గొంటారు. 13 వారాలు ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి కొత్తా వరుణ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్‌కి చెందిన తాడికొండ విజయకుమార్‌, అమెరికాకు చెందిన రామ్‌ చెరువు ఈ టీవీ సిరీస్‌ని నిర్మిస్తున్నారు. ఈ విశ్వనాదామృతం మొదటి ఎపిసోడ్‌ రేపు(నవంబర్‌1) మధ్యాహ్నం 1.30 గంటలకు ఈటీవీలో ప్రసారమవుతుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ