Advertisement
TDP Ads

21st పాటలు విడుదల!

Sun 01st Nov 2015 03:06 PM
21st movie,jaishankar,yadagiri,venkat,vindhya  21st పాటలు విడుదల!
21st పాటలు విడుదల!
Advertisement

వెంకట్, వింధ్య, నవీన్ ప్రధాన పాత్రల్లో సన్ ఫ్లవర్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫిల్మ్స్, అవుల్ మోషన్ పిక్చర్స్ పతాకాలపై యాదగిరి నిర్మిస్తున్న చిత్రం 21st. జయశంకర్ చిగురుల దర్శకుడు. ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. దర్శకుడు ఎన్.శంకర్, సయ్యద్ రఫీ కలిసి బిగ్ సీడీను విడుదల చేసారు. ఈ సందర్భంగా..

ఎన్.శంకర్ మాట్లాడుతూ.. జయశంకర్, యాదగిరి మంచి ఫలితం కోసం ప్రయత్నిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా ట్రైలర్, మ్యూజిక్ బావుంది. మంచి టెక్నీషియన్స్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తుంది. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.

సయ్యద్ రఫీ మాట్లాడుతూ.. ఈ సినిమా టీం ను చూస్తుంటే నా గత రోజులు గుర్తొస్తున్నాయి. 25సంవత్సరాల  వయసులో ఇండస్ట్రీకు వచ్చాను. ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు. ఈ సినిమాలో పాటను విజువల్ గా చూస్తుంటే టెక్నాలజీను ఉపయోగించి బాగా తీసారని తెలుస్తుంది. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. కొత్త టెక్నీషియన్స్ ను ప్రోత్సహిస్తేనే ఇండస్ట్రీలో మంచి చిత్రాలొస్తాయి. సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొంది. ఈ చిత్రంతో దర్శకనిర్మాతలు మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.

నిర్మాత యాదగిరి మాట్లాడుతూ.. యంగ్ టీం తో కొత్త ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఈ సినిమా కోసం బాగా సపోర్ట్ చేసారు. సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకొంది. త్వరలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ప్రేక్షకులు మమ్మల్ని ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాం..

దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ.. ఇదొక యూత్ ఫుల్ సస్పెన్స్  మూవీ. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆర్టిస్ట్స్ అందరు వారి పరిధిలో బాగా నటించారు. అభిషేక్ మ్యూజిక్ తో పాటు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఆడియో, సినిమా మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నాను.. అని చెప్పారు.

హీరో వెంకట్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో మెయిన్ లీడ్ చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్.. అని చెప్పారు. 

ఈ చిత్రానికి మ్యూజిక్: అభిషేక్ వాలింబే, ఎడిటింగ్: జయశంకర్ చిగురుల, ఫోటోగ్రఫీ: శ్రీవాస్, లిరిక్స్: లక్కీ, రఘురాం, ప్రొడ్యూసర్: యాదగిరి, డైరెక్టర్: జయశంకర్ చిగురుల. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement