Advertisementt

ఈసారి త్రిష భయపెడుతుందట.!

Sun 01st Nov 2015 03:00 PM
tamil movie aranmai,director sunder making aranmai2,aranmai2 as chandrakala2 in telugu,trisha in aranmai2,sidharth in aranmai2,aranmai2 releasing on 14th jan  ఈసారి త్రిష భయపెడుతుందట.!
ఈసారి త్రిష భయపెడుతుందట.!
Advertisement
Ads by CJ

హన్సిక, ఆండ్రియా, వినయ్‌, సుందర్‌ సి. ప్రధాన పాత్రల్లో సుందర్‌ సి. దర్శకత్వంలో తమిళంలో రూపొందిన అరణ్మయి తెలుగులో చంద్రకళగా విడుదలై సూపర్‌హిట్‌ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు సుందర్‌ సి. అరణ్మయి సీక్వెల్‌ని చేస్తున్నాడు. అయితే ఫస్ట్‌ పార్ట్‌ వున్న మెయిన్‌ లీడ్స్‌లో హన్సిక మాత్రమే సెకండ్‌ పార్ట్‌లో కనిపిస్తుంది. సిద్ధార్థ, త్రిష, పూనమ్‌ బజ్వా అరణ్మయి2లో నటిస్తున్నారు. ఖుష్బూ సుందర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. చంద్రకళలో ఆండ్రియా అందర్నీ భయపెట్టిన విషయం తెలిసిందే. సెకండ్‌ పార్ట్‌లో ఆ బాధ్యతని త్రిష తీసుకుందట. తన శాయశక్తులా ఆడియన్స్‌ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తోందట. 

సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌, శ్రీశుభశ్వేత ఫిలింస్‌ పతాకాలపై చంద్రకళ చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేసిన సి.కళ్యాణ్‌ చంద్రకళ2 చిత్రాన్ని కూడా తన బేనర్స్‌ ద్వారానే రిలీజ్‌ చేస్తున్నాడు. గతంలో తేజ సినిమా బేనర్‌లో చాలా సినిమాలు చేసిన సి.కళ్యాణ్‌కి కొన్ని సక్సెస్‌లు వచ్చినా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌ స్టార్ట్‌ చేసిన తర్వాత రిలీజ్‌ చేసిన మొదటి సినిమా చంద్రకళ అతనికి మంచి ప్రాఫిట్స్‌ తెచ్చిపెట్టింది. ఆ ఉత్సాహంతో ఆ తర్వాత అదే బేనర్‌లో చాలా సినిమాలు చేశాడు. చంద్రకళ2 చిత్రాన్ని కూడా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌లోనే రిలీజ్‌ చేస్తున్న సి.కళ్యాణ్‌కి ఇది ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ