Advertisementt

సక్సెస్ టూర్ కు వెళ్తున్న రాజుగారిగది!

Thu 29th Oct 2015 04:20 PM
raju gari gadi success tour,omkar,ashwin babu  సక్సెస్ టూర్ కు వెళ్తున్న రాజుగారిగది!
సక్సెస్ టూర్ కు వెళ్తున్న రాజుగారిగది!
Advertisement
Ads by CJ

అశ్విన్ బాబు, చేతన్, ధన్య బాలకృష్ణన్ ప్రధాన పాత్రల్లో ఓక్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై ఓంకార్ దర్శకత్వం వహించిన చిత్రం రాజు గారి గది. ఇటీవల విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో చిత్రబృందం అన్ని ఏరియాలకు వెళ్లి ప్రేక్షకులకు థాంక్స్ చెప్పనున్నారు. ఈ సందర్భంగా..

డైరెక్టర్ ఓంకార్ మాట్లాడుతూ.. సాయి కొర్రపాటి, అనిల్ సుంకర ల సపోర్ట్ తో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసాను. అందరి నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. అక్టోబర్ 30న ఓవర్ సీస్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. రేపటి నుండి వైజాగ్, కాకినాడ, రామచంద్రాపురం, అమలాపురం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కడప, కర్నూలు తదితర ప్రాంతాల్లో పర్యటించి అన్ని థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులను పలకరించనున్నాం. మొదటగా వైజాగ్ లోని విమ్యాక్స్ థియేటర్ కు వెళ్ళనున్నాం.. అని చెప్పారు.

అనిల్ సుంకర మాట్లాడుతూ.. సినిమా కోసం కల్మషం లేకుండా పాజిటివ్ గా పని చేస్తే మంచి రిజల్ట్ వస్తుందని రాజు గారి గది ప్రూవ్ చేసింది. ఓంకార్ అతి తక్కువ బడ్జెట్ లో రిచ్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు.. అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో అశ్విన్ కుమార్, సాయి కొర్రపాటి, సాయి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి డైలాగ్స్: సాయి మాధవ్ బుర్ర, లిరిక్స్: చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, ఆర్ట్: సాహి సురేష్, ఎడిటర్: నాగరాజ్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఎస్.జ్ఞానం, మ్యూజిక్: సాయి కార్తిక్, ప్రొడ్యూసర్: ఓక్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లిమిటెడ్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఓంకార్. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ