Advertisementt

నారా హీరో చెయ్యేస్తే!

Thu 29th Oct 2015 01:08 PM
nara rohit,raja cheyyi vesthe,pradeep,varahi banner  నారా హీరో చెయ్యేస్తే!
నారా హీరో చెయ్యేస్తే!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో నారా రోహిత్ స‌రికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. ఒకేసారి తొమ్మిది చిత్రాల‌కి ప‌చ్చ‌జెండా ఊపేసి తిరుగులేని క‌థానాయ‌కుడు అనిపించుకొన్నాడు. ప్రామిసింగ్ హీరో అన్న ముద్ర ప‌డ‌టంతో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆయ‌న‌తో సినిమాలు చేసేందుకు క్యూ క‌డుతున్నారు. కేవ‌లం  మార్కెట్ ప‌రంగానే కాదు... రోహిత్‌లోని న‌టుడు కూడా కొన్ని క‌థ‌ల్ని ప్ర‌త్యేకంగా ఆక‌ర్షిస్తున్నాడు. యువ క‌థానాయ‌కుడు చేయాల్సిన ద‌మ్మున్న పాత్ర అన‌గానే అది స‌రాస‌రి నారా రోహిత్ ద‌గ్గ‌రికి వెళ్లిపోతుంటుంది. అందుకే రోహిత్ చేతిలో ఇప్పుడు కీల‌క‌మైన తొమ్మిది సినిమాలున్నాయి. ఇక ఆయ‌న ఒప్పుకొన్న ఆ సినిమాల్ని ఒక్కొక్క‌టిగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డ‌మే మిగిలుంది. 

మొన్న‌టిదాకా చిన్న ద‌ర్శ‌కులు, చిన్న నిర్మాత‌లు మాత్ర‌మే నారా రోహిత్‌వైపు చూసేవాళ్లు. కానీ ఇప్పుడు బ‌డా నిర్మాత‌లు కూడా రోహిత్‌తో సినిమా చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నాయి. అందులో భాగంగా ఇటీవ‌ల వారాహి చ‌ల‌న చిత్ర సంస్థ రోహిత్‌తో ఓ సినిమాని మొద‌లుపెట్టింది. ఈగ‌, లెజెండ్‌లాంటి భారీ చిత్రాన్ని నిర్మించిన  సంస్థ అది. తాజాగా ప్ర‌దీప్ అనే ఓ కొత్త ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేస్తూ నారా రోహిత్‌తో సినిమా మొద‌లుపెట్టారు. ఆ సినిమాకి రాజా చెయ్యి వేస్తే అనే పేరు ఖ‌రారు చేశార‌ని తెలిసింది. మాస్ అంశాల‌తో పాటు వినోదానికీ ప్రాధాన్య‌మున్న క‌థ‌తో  ఆ చిత్రం తెర‌కెక్కుతున్న‌ట్టు స‌మాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ