Advertisementt

రా.. రమ్మని సినిమా ప్రారంభం!

Mon 26th Oct 2015 06:41 AM
raa rammani movie opening,sambasivarao,dasari brahmanandam,deepak  రా.. రమ్మని సినిమా ప్రారంభం!
రా.. రమ్మని సినిమా ప్రారంభం!
Advertisement
Ads by CJ

దీపక్, లొవే సాసన్, మధుర ప్రధాన పాత్రల్లో ది వైట్ ఫీల్డ్ సినిమాస్ సమర్పణలో దాసరి బ్రహ్మానందం దర్శకత్వంలో మిద్దె సాంబశివరావు గౌడ్ నిర్మిస్తున్న చిత్రం రా.. రమ్మని.. ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుక సోమవారం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నటుడు నరేష్ క్లాప్ కొట్టగా, మిద్దె పద్మశ్రీ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. దాసరి బ్రహ్మానందం గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..

నిర్మాత సాంబశివరావు మాట్లాడుతూ.. మా ప్రొడక్షన్ లో వస్తున్న మొదటి చిత్రమిది. ఇదొక ఫ్యామిలీ సెంటిమెంట్ డ్రామా. దర్శకత్వశాఖలో మంచి అనుభవం ఉన్న దాసరి బ్రహ్మానందం గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చిన్న చిత్రమయినా.. ఇళయరాజా గారు సంగీతం అందించి సపోర్ట్ చేస్తున్నారు. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా చిత్రీకరించనున్నాం.. అని చెప్పారు.

దర్శకుడు దాసరి బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఎన్నో చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాను. మొదటిసారిగా ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం కానున్నాను. ఇది చిన్న చిత్రమైనా పెద్ద టెక్నీషియన్స్, సీనియర్ ఆర్టిస్టులు పని చేస్తున్నారు. కీలకమైన పాత్రలో ఓ ఫేమస్ యాక్టర్ కనిపించనున్నారు. నవంబర్ 5 నుండి జనవరి వరకు కంటిన్యూస్ గా షూట్ చేయనున్నాం.. అని చెప్పారు.

దీపక్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఓ లవర్ బాయ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాను. ఈ చిత్రంతో మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను.. అని చెప్పారు.

లొవే సాసన్ మాట్లాడుతూ.. హిందీలో ఆర్టిస్ట్ గా కొన్ని చిత్రాలకు పని చేసాను. తెలుగులో ఇది నా మొదటి సినిమా. నాకు ఈ అవకాసం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు.. అని చెప్పారు.

మధుర మాట్లాడుతూ.. మరాఠీలో రెండు చిత్రాల్లో, తమిళంలో ఒక చిత్రంలో నటించాను. తెలుగులో నటిస్తున్న మొదటి చిత్రమిది. అందరు సపోర్ట్ చేయాలాని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.

ఈ చిత్రానికి మ్యూజిక్: ఇళయరాజా, ఎడిటర్: గౌతంరాజు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రాము పినిశెట్టి, యాక్షన్: రామ్ లక్ష్మణ్, కోరియోగ్రఫీ: బండ్ల రామారావు, ఆర్ట్: షర్మెల యాలిశెట్టి, కాస్ట్యూమ్స్: భాష, స్టిల్స్: రాజు, ప్రొడక్షన్ కంట్రోలర్: బిఎం.రాము, ప్రొడక్షన్ మేనేజర్: రాజేష్ రంబల, కో డైరెక్టర్స్: కర్ర గోపీనాథ్, హరి వెంకట కుమార్, అసోసియేట్: కె.రామ మూర్తి, అసిస్టెంట్ డైరెక్టర్స్: ఆఖిల్ అహ్మద్, ప్రతాప్ తమిర్చి, నిర్మాత: మిద్దె సాంబశివరావు గౌడ్, కథ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్-దర్శకత్వం: దాసరి బ్రహ్మానందం.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ