Advertisementt

బేబీ రికార్డింగ్ మొదలైంది!

Sat 24th Oct 2015 09:09 AM
baby movie,horror thriller movie,viswanath,sudhakar chowdary  బేబీ రికార్డింగ్ మొదలైంది!
బేబీ రికార్డింగ్ మొదలైంది!
Advertisement
Ads by CJ

తమిళంలో రూపొంది ఘన విజయం సాధించిన బేబీ చిత్రాన్ని అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.  అందరూ కొత్త నటీనటులతో నూతన నిర్మాణ సంస్థలు విశ్వాస్ మీడియా మరియు మెంటార్ మూవీస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ తెలుగు రికార్డింగ్ మరియు డబ్బింగ్ కార్యక్రమాలు విజయదశమి నాడు (అక్టోబర్ 22న) ప్రారంభమయ్యాయి. ప్రఖ్యాత దర్శకులు భారతీ రాజా తనయుడు మనోజ్ భారతీరాజా ఈ చిత్రంలో హీరోగా నటించడం విశేషం. అంజలిరావ్, శైరా గర్గ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో బేబి సతన్య, బేబి శ్రీవర్షిణి కీలకపాత్రలు పోషించారు. ఈ సందర్భంగా..

చిత్ర నిర్మాతలు విశ్వనాధ్ డికె, సుధాకర్ చౌదరి మాట్లాడుతూ... తమిళంలో రూపొంది ఘన విజయం సాధించిన బేబీ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అనువదిస్తున్నాం. డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కుడా అలరిస్తుందన్న నమ్మకంతోనే ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నాం. ప్రఖ్యాత దర్శకులు భారతీ రాజా తనయుడు మనోజ్ భారతెరాజా ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించడం విశేషం. దసరా సందర్భంగా అక్టోబర్ 22న ఈ చిత్రం డబ్బింగ్ మరియు రికార్డింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టాం. డిసెంబర్ లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం.. అన్నారు. 

మనోజ్ భారతీరాజా, అంజలీరావ్, శైరా గర్గ్, బేబీ సతన్య, బేబీ శ్రీవర్షిణి తదితరులు ముఖ్యపాత్రాలి పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సతీష్, ఎడిటింగ్: భగత్ సింగ్, చాయాగ్రహణం: జోన్స్ ఆనంద్, సహా నిర్మాత: మురళి కోటపాటి, నిర్వాహక నిర్మాతలు: సత్య-శిరీష్, నిర్మాతలు: విశ్వనాధ్ డికె - పుట్టా సుధాకర్ చౌదరి, దర్శకత్వం: డి.సురేష్! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ