అశ్విన్ బాబు, చేతన్, ధన్య బాలకృష్ణన్ ప్రధాన పాత్రల్లో ఓక్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై ఓంకార్ దర్శకత్వం వహించిన చిత్రం రాజు గారి గది. అక్టోబర్ 22న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ.. నిజానికి ఈ సినిమా డిసెంబర్ 4న రిలీజ్ కావాల్సింది. కాని సాయి కొర్రపాటి, అనిల్ సుంకర వంటి పెద్దల సహాయంతో దసరా కానుకగా రిలీజ్ చేసాం. థియేటర్స్ దొరికితే చాలు అనుకున్న చిత్రానికి థియేటర్స్ పెరుగుతున్నాయని తెలిసి చాలా సంతోషంగా అనిపిస్తుంది. థియేటర్ లో ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎడిటింగ్ చేసిన సన్నివేశాలు కూడా ఉంటే బావుటుందనిపించింది. ఈ చిత్రంతో మంచి బ్రేక్ వస్తుందని అందరం కష్టపడి పని చేసాం. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. సిసిఎల్ లో ఆడాలని డ్రీమ్. కాని నాలుగైదు సినిమాల్లో నటిస్తేనే సిసిఎల్ ఆడే అర్హత వస్తుందని ఈ సినిమాలో నటించాను. ఫైనల్ గా రాజుగారిగది సినిమాతో నన్ను దసరా హీరో చేసారు. హీరో కావడానికి అద్రుష్టం, టాలెంట్, నటన తో పాటు ఓర్పు కూడా అవసరం. హీరో శ్రీకాంత్, సందీప్ కిషన్, ప్రిన్స్ ఇలా చాలా మంది సినిమా చూసారు. సెలెబ్రిటీస్ ఇచ్చిన వైరల్ వీడియోతోనే సినిమాకు ఇంత హైప్ వచ్చింది. ప్రస్తుతం జతకలిసే సినిమాలో నటిస్తున్నాను. షూటింగ్ మొత్తం పూర్తయింది. త్వరలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.. అని చెప్పారు.