యామిని భాస్కర్, జ్వాల కోటి, ప్రధాన పాత్రల్లో గౌతమి టాకీస్ పతాకంపై ఎన్.వి.బి.చౌదరి దర్శకత్వంలో కిశోర్‌కుమార్ పర్వతరెడ్డి నిర్మిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ కీచక. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 30న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో..
దర్శకుడు ఎన్.వి.బి.చౌదరి మాట్లాడుతూ.. యదార్థ సంఘటనల ఆధారంగా చాలా రియలిస్టిక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. బస్తీ లో నివసించే ఓ దుర్మార్గుడు 300 మంది ఆడవాళ్ళను అత్యాచారం చేస్తాడు. తన కథను సినిమాగా తీర్చిదిద్దాం. చాలా మందికి ఇన్స్పిరేషనల్ గా ఈ చిత్రం నిలుస్తుంది. ఈ నెల 30న రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.
ఎన్.వి.రావు మాట్లాడుతూ.. నిర్భయ చట్టం వచ్చినా మహిళలపై జరిగే అత్యాచార నేరాలు తగ్గలేదు. అలాంటి పనులు చేసేవారందరికీ ఈ సినిమా ఓ హెచ్చరిక. ఈ చిత్రం నచ్చి తమిళంలో డబ్ చేస్తున్నాం. వచ్చే నెలలో తమిళంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాం.. అని చెప్పారు.
నిర్మాత కిశోర్‌కుమార్ మాట్లాడుతూ.. నాగపూర్ లో జరిగిన ఓ యదార్థ సంఘటనను కథగా తీసుకొని ఈ చిత్రాన్ని నిర్మించాం. 300 అత్యాచారాలు చేసిన ఓ వ్యక్తి కథను సినిమాగా చేసాం. లేడీస్ కు సపోర్ట్ ఇచ్చే మూవీ ఇది. 24 రోజుల్లో ఈ చిత్రం పూర్తి చేసాం. 100 థియేటర్లకు పైగా అక్టోబర్ 30 న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం.. అని చెప్పారు.
జ్వాల కోటి మాట్లాడుతూ.. మంచి క్లారిటీ తో కథను తీసుకొని ఎన్.వి.బి.చౌదరి గారు బాగా డైరెక్ట్ చేసారు. టీమ్ ఎఫర్ట్ పెట్టి చేసిన సినిమా ఇది. మంచి రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నాం.. అని చెప్పారు.
ఈ చిత్రంలో యామిని భాస్కర్, జ్వాల కోటి, రఘుబాబు, గిరిబాబు, రోజ, అప్పారావు, హరిబాబు, వినోద్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: డా॥ జోశ్యభట్ల, కెమెరా: కమలాకర్, కోడైరెక్టర్: రామస్వామి, మాటలు: రామ్‌ప్రసాద్ యాదవ్, ఎడిటింగ్: రాంబాబు మేడికొండ, నిర్మాత: కిశోర్‌కుమార్ పర్వతరెడ్డి, దర్శకత్వం: ఎన్.వి.బి.చౌదరి.