Advertisementt

ఇది నాన్నకు ప్రేమతో పై వున్న క్రేజ్..!

Sat 24th Oct 2015 01:09 AM
nannaku prematho movie,ntr,sukumar,b.v.s.n.prasad  ఇది నాన్నకు ప్రేమతో పై వున్న క్రేజ్..!
ఇది నాన్నకు ప్రేమతో పై వున్న క్రేజ్..!
Advertisement
Ads by CJ

నాన్నకు ప్రేమతో.. టీజర్‌కు ఒక్కరోజులోనే 1 మిలియన్‌ వ్యూస్‌, 25 వేల లైక్స్‌..

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, ఆర్య సుకుమార్‌ కాంబినేషన్‌లో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం నాన్నకు ప్రేమతో.. ఈ చిత్రం టీజర్‌ విజయదశమి కానుకగా అక్టోబర్‌ 21 సాయంత్రం 6 గంటలకు విడుదలైంది. ఈ టీజర్‌కు ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో వ్యూస్‌, లైక్స్‌ లభించాయి. ఈ సందర్భంగా..

నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ.. విజయదశమి కానుకగా అక్టోబర్‌ 21 సాయంత్రం విడుదలైన నాన్నకు ప్రేమతో.. టీజర్‌కు ప్రపంచ వ్యాప్తంగా ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఒక్కరోజులోనే ఈ టీజర్‌కు 1 మిలియన్‌ వ్యూస్‌ లభించడం విశేషం. అలాగే 25 వేల లైక్స్‌ కూడా రావడం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో వున్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్‌ డిఫరెంట్‌గా లుక్‌తో కనిపించే ఈ చిత్రం టీజర్‌ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. టీజర్‌ ఎక్స్‌ట్రార్డినరీగా వుందని, తప్పకుండా ఎన్టీఆర్‌ కెరీర్‌లో నాన్నకు ప్రేమతో.. పెద్ద హిట్‌ సినిమా అవుతుందని చెప్తున్నారు. నవంబర్‌ 1 నుంచి స్పెయిన్‌లో నెలరోజులపాటు ఓ భారీ షెడ్యూల్‌ చెయ్యబోతున్నాం. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం.. అన్నారు. 

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ