రాజుగారి గది చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్
వారాహిచలనచిత్రం, ఎ.కె.ఎంటర్ టైన్ మెంట్స్, ఓక్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి, బ్యానర్స్ పై ఓంకార్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం రాజుగారి గది. అశ్విన్, చేతన్, ధన్యబాలకృష్ణన్, ఈశాన్య, షకలక శంకర్, ధనరాజ్, విద్యుల్లేఖ రామన్ తదితరులు నటించిన ఈ హర్రర్ కామెడి చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 22న విడుదలై హిట్ టాక్ సంపాదించుకుంది. సినిమా మంచి కలెక్షన్స్ సాధిస్తుంది. సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. సినిమా రిలీజ్ అయిన ప్రతిచోట నుండి సినిమా బాగుందని టాక్ రావడం ఎంతో హ్యపీగా ఉంది. సినిమాలో ఫస్టాఫ్ చాలా బావుందని, ముఖ్యంగా షకలక శంకర్, ధన్ రాజ్ కామెడితో పాటు విద్యుల్లేఖ కామెడిని ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మంచి కథతోపాటు, మెసేజ్ ఉన్న చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఓంకార్ ను అభినందిస్తున్నాం. సినిమా రిలీజ్ అయిన థియేటర్స్ సంఖ్యను రేపటి నుండి పెంచుతున్నాం. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ అని నిర్మాతలు తెలియజేశారు.