రవితేజ హీరోగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వేణుశ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం ఎవడో ఒకడు. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక గురువారం హైదరాబాద్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా, హరీష్ శంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. సుకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..
దిల్ రాజు మాట్లాడుతూ.. బధ్ర సినిమా తరువాత రవితేజ తో చేస్తున్న సినిమా. మా బ్యానర్ లో వేణుశ్రీరామ్ ఓ మై ఫ్రెండ్ సినిమా చేసి హిట్ ఇచ్చాడు. మంచి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సబ్జెక్టు తో వస్తున్న ఈ సినిమా కూడా హిట్ అవుతుందని భావిస్తున్నాను. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా, రిచర్డ్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. నవంబర్ లో షూటింగ్ మొదలుపెట్టి 2016 సమ్మర్ కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం.. అని చెప్పారు.
హీరో రవి తేజ, దర్శకుడు వేణుశ్రీరామ్ చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఈ చిత్రానికి మ్యూజిక్: దేవిశ్రీప్రసాద్, కెమెరా: రిచర్డ్ ప్రసాద్, డైలాగ్స్: రమేష్-గోపి, ఎడిటర్: కార్తిక్ శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్: రమణ వంక.