Advertisementt

ప‌వ‌న్... ర‌త్తన్‌పూర్ పోలీసు!

Wed 21st Oct 2015 07:09 AM
pavan kalyan,sardar gabbar singh,gabbar singh,pavan kalyan,bobby,kajal,laxmiraai  ప‌వ‌న్... ర‌త్తన్‌పూర్ పోలీసు!
ప‌వ‌న్... ర‌త్తన్‌పూర్ పోలీసు!
Advertisement
Ads by CJ
గ‌బ్బర్‌సింగ్ సినిమాలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కొండ‌వీటి పోలీసుగా  క‌నిపించి అల‌రించాడు. అయితే ఈసారి మాత్రం ఆయ‌న అడ్ర‌స్ మారిపోయింది. ర‌త్త‌న్‌పూర్ పోలీసుగా సంద‌డి చేయ‌బోతున్నాడు ప‌వ‌న్‌. ఇదివ‌ర‌కు వ‌చ్చిన గ‌బ్బ‌ర్‌సింగ్‌కి సీక్వెల్‌గా స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ పేరుతో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. సీక్వెల్ అంటే ఇదేమీ ప‌క్కా సీక్వెల్ కాదు. ఆ క‌థ‌కీ,ఈ క‌థ‌కీ అస‌లు సంబంధమే ఉండ‌దు. కేవ‌లం పేరును, పోలీసు పాత్ర‌నీ, ఆ పాత్ర‌కున్న తిక్క‌ని మాత్ర‌మే వాడుకొంటున్నారని స‌మాచారం. అందుకే ఆ పాత్ర అడ్ర‌స్ కూడా మారిపోయింది. 
 ఇటీవ‌ల ప‌వ‌న్‌క‌ళ్యాణ్  త‌ర‌చుగా స‌ర్దార్ గెబ్బ‌ర్‌సింగ్ గెట‌ప్‌లోనే క‌నిపిస్తున్నాడు. ఆ స‌మ‌యంలో ఆయ‌న చేతికి ఉన్న బ్యాడ్జీ ఆధారంగా ర‌త్త‌న్‌పూర్ పోలీసు అన్న విష‌యం తెలిసిపోయింది. ఆ బ్యాడ్జీపై ర‌త్త‌న్‌పూర్ పోలీసు అని రాసుంది. ర‌త్త‌న్‌పూర్ అంటే మ‌హారాష్ట్రకి సంబంధించిన ప్రాంతంగా అనిపిస్తోంది. దీన్నిబ‌ట్టి స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ క‌థ మ‌న ఏరియాలో న‌డిచేది కాద‌ని అర్థ‌మ‌వుతోంది. మన‌ది కాని ఊరికి వెళ్లి అక్క‌డ రౌడీల్ని, ముఠాల్ని గ‌డ‌గ‌డ‌లాడించే పోలీసుగా ప‌వ‌న్ క‌నిపించ‌నున్నాడ‌న్న‌మాట‌. తొలిసారి విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో కూడా రౌడీ మూక ఓ బీహార్‌కి చెందిన ఓ బంధిపోటు ముఠా తర‌హాలోనే  క‌నిపించింది. 
చూసిన పాత్రే అయినా ప‌వ‌న్‌ని ఓ కొత్త త‌ర‌హా గెట‌ప్‌లో చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు బాబీ. పోలీసు డ్రెస్సులో క‌నిపిస్తున్న విధానంలొ కూడా తేడా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. శ‌ర‌వేగంగాచిత్రీక‌ర‌ణ జ‌రుపుకొంటున్న ఈ సినిమాని ఎలాగైనా సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల్సిందే అని ప‌వ‌న్ కంక‌ణం క‌ట్టుకొన్న‌ట్టున్నాడు. త్వ‌ర‌లోనే గుజ‌రాత్‌లో చిత్రీక‌ర‌ణ కోసం బ‌య‌లుదేర‌బోతున్నాడు. ఈ సినిమాలో ప‌వ‌న్ స‌ర‌స‌న కాజ‌ల్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ