Advertisementt

చిత్రాంగద ట్రైలర్ లాంచ్!

Tue 20th Oct 2015 09:20 AM
chithrangada trailer launch,anjali,sreedhar,ashok  చిత్రాంగద ట్రైలర్ లాంచ్!
చిత్రాంగద ట్రైలర్ లాంచ్!
Advertisement
Ads by CJ

అంజలి, దీపక్, సింధు తులాని ప్రధాన పాత్రల్లో శ్రీ విజ్ఞేశ్ కార్తిక్ బ్యానర్ లో గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న చిత్రం చిత్రాంగద. అశోక్.జి దర్శకుడు. ఈ చిత్రం టీజర్ లాంచ్ మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా.. 

దర్శకుడు అశోక్ మాట్లాడుతూ.. ఈ సినిమా తొంబై శాతం షూటింగ్ అమెరికాలో 40 రోజులు చేసాం. గీతాంజలి చిత్రం తరువాత అంజలి మెయిన్ లీడ్ లో నటిస్తున్న చిత్రమిది. అతితక్కువ ఉష్ణోగ్రతలో షూట్ చేసాం.  హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పని చేసారు. చిన్న చిత్రాల్లో హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పని చేసిన సినిమా ఇది. ఈ చిత్రంలో అంజలి చాలా కొత్తగా, గ్లామరస్ గా కనిపిస్తుంది. 15 నుండి 18 కేజీల బరువు తగ్గింది. డెడికేషన్ ఉన్న ఆర్టిస్ట్. ఈ చిత్రానికి తండ్రి కొడుకులైన సెల్వ గణేష్, సెల్వ స్వామినాథన్ మ్యూజిక్ అందించారు. ఫోటోగ్రఫీ, మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. నవంబర్ లో ఆడియో విడుదల చేసి, డిసెంబర్ లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.. అని చెప్పారు.

నిర్మాత శ్రీధర్ మాట్లాడుతూ.. ఇది మా ప్రొడక్షన్ లో వస్తున్న నాల్గవ చిత్రం. స్టొరీ వినగానే అంజలి అయితే ఈ సినిమాకు యాప్ట్ అవుతుందని తనను సెలెక్ట్ చేసుకున్నాం. సప్తగిరి కామెడీ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. మైసూర్, హైదరాబాద్, అమెరికా ప్రాంతాల్లో సినిమా షూటింగ్ నిర్వహించాం.. అని చెప్పారు.

అంజలి మాట్లాడుతూ.. ఇదొక డిఫరెంట్ మూవీ. హారర్ జోనర్ కాదు.. ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని పాయింట్ తో ఈ సినిమా తీసాం. 85 శాతం షూటింగ్ అమెరికా లో చేసాం. అశోక్ గారు నాకు ఏం స్టొరీ నేరేట్ చేసారో.. అదే తీసారు. డిఫరెంట్ లుక్ లో కనిపిస్తాను. ఇంకా 10 డేస్ షూటింగ్ బ్యాలన్స్ ఉంది. సాంగ్స్ షూట్ చేసి ఆడియో త్వరలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.. అని చెప్పారు.

ఈ చిత్రానికి ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, లిరిక్స్: శ్రీమణి, బాలాజీ, సంగీతం: సెల్వ గణేష్, సెల్వ స్వామినాథన్, కెమెరా: జేమ్స్ క్వాన్, హమీద్ రోడిన్, బాల్ రెడ్డి, నిర్మాత: గంగపట్నం శ్రీధర్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: అశోక్.జి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ