బ్రూస్ లీతో నిర్మాతగా డీవీవీ దానయ్యకు ఎంత లాభం వచ్చిందో తెలీదు గానీ నష్టం మాత్రం రాలేదన్నది ట్రేడ్ వర్గాల మాట. అనుకున్న సమయానికి రామ్ చరణ్ అభిమానులని బ్రూస్ లీతో అలరించడం కోసం రెండు యూనిట్లు పెట్టి మరీ యమా స్పీడుగా షూటింగ్ కానిచ్చేసిన దానయ్య ఒక రకంగా అభినందనీయుడే అయినా సినిమాని నమ్మి అత్యధిక రేట్లకు చాలా ఏరియాలను కొని నష్టపోయిన పంపిణీదారుల పరిస్థితి మరీ దారుణంగా తయారయింది.
ఇక్కడ మరో విషయం ఏమిటంటే దానయ్య నిర్మాతగా చేసిన చాలా సినిమాలు బాక్సాఫీసు దగ్గర జంబలకిడిపంబ అవడం కొత్తేం కాదు. వరుడు, కెమెరా మెన్ గంగతో రాంబాబు భారీ నష్టాలు మూటగట్టుకున్నవే. కానీ ఇవేవీ దానయ్యను ఆపలేకపోయాయి. మరి ఆయన కెరీర్లో బ్రూస్ లీ ఎలాంటి ప్రయత్నంగా మిగులుతుందో పూర్తిగా తెలియకముందే రాం చరణ్ తదుపరి చిత్రం తని ఒరువన్ తెలుగు రీమేక్ కోసం భారీ ఖర్చుకు సిద్ధం అవడంతో ఈయనగారి ధైర్యానికి అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు.