Advertisement

త్రివిక్రమ్ ను మెప్పించిన ట్రైలర్!

Tue 20th Oct 2015 04:14 AM
player movie,trivikram sreenivas,yamuna kishore  త్రివిక్రమ్ ను మెప్పించిన ట్రైలర్!
త్రివిక్రమ్ ను మెప్పించిన ట్రైలర్!
Advertisement

ఎన్నో యాడ్స్ తో ప్రచార రంగంలో విశేష పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న డ్రీమ్ మర్చంట్స్ సంస్థ ఇప్పుడు సినిమా నిర్మాణంలోకి ప్రవేశించింది. త్రిబుల్ ఎక్స్ కంపెనీ అధినేత మానిక్యవేల్ తన కుమారుడు పర్వీన్ రాజ్ ను హీరోగా పరిచయం చేస్తూ ప్లేయర్ పేరుతో ఓ విభిన్న చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నారు. జ్ఞానసాగర్ దర్శకత్వంలో యమున కిషోర్, జగదీశ్ కుమార్ కల్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యమున కిషోర్ గారితో ఓ యాడ్ కోసం కలిసి పని చేసాను. డ్రీమ్ మర్చంట్స్ సంస్థకే కాదు.. అందులో ఉన్న వ్యక్తులకు కూడా సంస్కారం ఉంది. సాధారణంగా దర్శకుడు అనేవాడు ప్రేక్షకులను ఎగ్జైట్ చేయాలని కామెడీ చేయించినప్పుడో.. వయిలన్స్ తీసినప్పుడో.. ఓ గీత దాటి తీస్తాడు. కానీ ఆ గీతను కంట్రోల్ చేయగలిగినప్పుడే మంచి సినిమా చేయగలం. ఆ తత్వం డ్రీమ్ మర్చంట్స్ సంస్థ వారిలో కనిపిస్తుంది. విజువల్ గా ప్లేయర్ ట్రైలర్ చూస్తున్నంతసేపు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. సినిమా అంతా కూడా ఎగ్జైటింగ్ గా ఉంటుందని భావిస్తున్నాను. సినిమా నిర్మాణ రంగంలోకి దిగిన డ్రీమ్ మర్చంట్స్ వారికి సినీ ప్రయాణం అధ్బుతంగా ఉండాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.

నిర్మాత యమున కిషోర్ మాట్లాడుతూ.. బ్యాంకాక్, హాంగ్ కాంగ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఓ థ్రిల్లర్ మూవీ ఇది. పర్వీన్ రాజ్ చాలా బాగా నటించాడు. కెమెరా వర్క్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. రొటీన్ గా కాకుండా ఓ కొత్త ఆలోచనతో ఈ సినిమా చేసాం. ఈ నెల 30 న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం.. అని చెప్పారు.

పర్వీన్ రాజ్ మాట్లాడుతూ.. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని, నిర్మాతలకు లాభాలు రావాలని ఆశిస్తున్నాను.. అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో జ్ఞానశేఖర్, సురేష్, జగదీశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

పర్వీన్ రాజ్, షాహి, నాగినీడు, సీత, చాణక్య సాయి, తిరు, సుదర్శన్, తేజ, రానా, సిరింత్ర, ఈంగ్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం రాజేష్ రఘునాథ్, సినిమాటోగ్రఫీ సురేష్, ఎడిటింగ్ సందీప్ రావి, నిర్మాతలు యమున కిషోర్, జగదీశ్ కుమార్ కల్లూరి, దర్సకత్వం జ్ఞాన సాగర్.  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement