మాస్ మహరాజ రవితేజ కథానాయకుడిగా, తమన్నా, రాశిఖన్నా లు కథానాయికలుగా, సంపత్‌నంది దర్సకత్వం వహిస్తున్న చిత్రం బెంగాల్ టైగర్. కె.కె రాధామోహన్ నిర్మాత. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బొమన్ ఇరాని బిగ్ సీడీను విడుదల చేయగా.. నిర్మాత రాధామోహన్ ఆడియో సీడీలను విడుదల చేసారు. తమన్నా థియేట్రికల్ ట్రైలర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా..
బొమన్ ఇరాని మాట్లాడుతూ.. తమన్నా సినిమా కోసం హార్డ్ వర్క్ చేస్తుంది. రాశి సినిమాలో చాలా అందంగా ఉంటుంది. కేవలం 10 నుండి 15 నిమిషాలు కనిపించే నా పాత్ర కోసం సంపత్ చాలా కేర్ తీసుకున్నాడు. నటునిగా నేను గర్వంగా ఫీల్ అయ్యేలా చేసాడు. రవితేజ గారిలో ఎనర్జీ కు కారణం వారి అభిమానులే. ఒక్కరోజు కూడా తను లేజీ గా పని చేయడం చూడలేదు. ఇంతమంచి టీం తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది.. అని చెప్పారు.
రవితేజ మాట్లాడుతూ.. తమన్నా, రాశిఖన్నా లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది. తమన్నా తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. నిర్మాత రాధామోహన్ గారు ఈ సినిమాతో పెద్ద పెద్ద సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నాను. సంపత్ ఖచ్చితంగా బెంగాల్ టైగర్ తో హ్యాట్రిక్ కొడతాడు. బీమ్స్ లో మంచి టాలెంట్ ఉంది. తన ట్యూన్స్, మ్యూజిక్ సెన్స్ సూపర్బ్. తనతో ఫ్యూచర్ లో మరిన్ని ప్రాజెక్ట్స్ చేయాలి.. అని చెప్పారు.
డైరెక్టర్ సంపత్ నంది మాట్లాడుతూ.. రవితేజ గారి ఎనర్జీ గురించి మాట్లాడానికి నా ఎనర్జీ సరిపోదు. ఆయన మంచి మనసున్న వ్యక్తి. సింగిల్ సిట్టింగ్ లో కథ విని ఓకే చేసారు. నన్ను దర్శకునిగా చేసింది నిర్మాత రాధామోహన్ గారే. ఆయన నాకు తండ్రి సమానులు. ఈ సినిమాతో ఆయనకు మంచి లాభాలు రావాలి. మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ ను నేను మొదటి నుండి సపోర్ట్ చేస్తున్నాను. తను కంపోజ్ చేసిన ట్యూన్స్ రవితేజ కు వినిపించగానే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఓకే చేసారు. బీమ్స్ వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బెంగాల్ టైగర్ మొదలు పెట్టాను. తమన్నా కు ఫోన్ చేసి ఇలా సినిమా స్టార్ట్ చేస్తున్నాను. నటిస్తారా.. అని అడిగిన వెంటనే ఒప్పుకున్నారు. ఈ సినిమాతో రాశిఖన్నా కు కమర్షియల్ సక్సెస్ వస్తుంది. సౌందర్ రాజన్ ఫోటోగ్రఫీ అధ్బుతంగా ఉంటుంది. అందరిని ఆకట్టుకునే విధంగా సినిమా ఉంటుంది.. అని చెప్పారు.
తమన్నా మాట్లాడుతూ.. బీమ్స్ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అయినా.. ఐదు పవర్ ఫుల్ సాంగ్స్ ఇచ్చాడు. కథ ముందుకు వెళ్ళాలంటే సాంగ్స్ అనేవి చాలా ముఖ్యం. తన పాటలతో బీమ్స్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్ళాడు. సంపత్ గారు కథ చెప్పినప్పుడు విజువల్స్ మన మైండ్ లోకి వస్తాయి. నా కెరీర్ కు హెల్ప్ అయిన రచ్చ లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చారాయన. ఆయనతో మరో సినిమా చేయడం ఆనందంగా ఉంది. రాశి జెన్యూన్ యాక్టర్. చాలా న్యాచురల్ గా నటిస్తుంది. తను స్టార్ హీరోయిన్ గా ఎదగాలని ఆశిస్తున్నాను. రవి తేజ గారితో వర్క్ చేయాలనీ నా కెరీర్ స్టార్ట్ అయినప్పటినుండి అనుకుంటున్నాను. చాలా నిజాయితీగా వర్క్ చేస్తారు. ఆయనతో మళ్ళి మళ్ళి వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. రాధామోహన్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా చేసారు.. అని చెప్పారు.
మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ మాట్లాడుతూ.. సంపత్ గారి మాట విని రవితేజ గారు నన్ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఒప్పుకున్నారు. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఆడియో, సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.
నిర్మాత రాధామోహన్ మాట్లాడుతూ.. చిన్నపాటి సినిమాలు నిర్మించే నాకు ఇంత పెద్ద సినిమాకు పని చేసే అవకాశం ఇచ్చిన రవితేజ గారికి థాంక్స్. సంపత్ 2007 నుండి నాకు తెలుసు. తనలో టాలెంట్ చూసి ఏమైంది ఈవేళ అనే సినిమాను నిర్మించాను. ఈ చిత్రాన్ని చాలా మంది నిర్మాతలు ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చినా.. సంపత్ నాతోనే సినిమా చేసాడు. తమన్నా తన గ్లామర్ తో సినిమాకు కల తెచ్చింది. రాశి ఖన్నా కథ నచ్చి సినిమాలో నటించడానికి ఓకే చేసారు. బీమ్స్ అనుకున్నదానికంటే ఇంకా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.
రామజోగయ్యశాస్త్రి మాట్లాడుతూ.. రవితేజ గారి దుబాయ్ శీను సినిమాకు పాటలు రాసాను. నన్ను కమర్షియల్ ఎస్టాబ్లిష్ చేసిన సినిమా అది. మరోసారి ఆయనతో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో సంపత్ గారు నాతో టైటిల్ సాంగ్ రాయించారు. బీమ్స్ మంచి మ్యూజిక్ కంపోజ్ చేసాడు. తనకు ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుంది. సంపత్ గారు మంచి కంటెంట్ ఉన్న రైటర్. రచయితకు గౌరవం ఇస్తారు. ఈ సినిమా ఆయనకు బ్లాక్ బాస్టర్ హిట్ ఇస్తుందనడంలో సందేహం లేదు.. అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో రాశిఖన్నా, రామ్ లక్ష్మణ్, హంస నందిని, అక్ష, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రలో మాస్‌మహరాజ్ రవితేజ, తమన్నా, రాశిఖన్నా, బోమన్ ఇరాని, బ్రహ్మనందం, రావు రమేష్, షియాజి షిండే, నాజర్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ళ భరణి, హర్హవర్ధన్ రానే, పృద్వి, సురేఖ వాణి, అక్ష, శ్యామల, ప్రియ, ప్రభు, ప్రగతి, నాగినీడు, ప్రభ, రమాప్రభ తదితరులు నటించగా..
బ్యానర్ : శ్రీ సత్యసాయి ఆర్ట్స్, కెమెరా: సౌందర్ రాజన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: డి,వై.సత్యనారాయణ, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, సంగీతం భీమ్స్, నిర్మాత: కె.కె.రాధామెహన్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే -దర్శకత్వం: సంపత్ నంది.