ఆగడులో ఐటెం సాంగ్ చేసి అనవసరం అనిపించుకున్న శృతి హాసన్ అదే హీరో మహేష్ బాబు సరసన శ్రీమంతుడులో భాగస్వామి అయి చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించింది. నటిగా శృతిలోని నిజాయితీని ఎన్నోసార్లు కీర్తించిన మహేష్ బాబు, మరోసారి హాసన్ కుటుంబానికి తన సాన్నిహిత్యాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతానికి బ్రహ్మోత్సవం షూటింగులో బిజీగా ఉన్న మాహేశ్ బాబు తన తదుపరి చిత్ర ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తున్నాడు.
మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మాణం కాబోతున్న మాహేశ్ బాబు నెక్స్ట్ ప్రాజెక్టుకి శృతి హాసన్ని కథానాయికగా కంఫర్మ్ చేసారు. ఘజిని లాంటి సూపర్ హిట్టుతో తెలుగు, హిందీలో బ్రేక్ సాధించిన మురుగదాస్ ఎన్నాళ్ళుగానో మహేష్ బాబుతో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇన్నాళ్ళకు వర్క్ అవుట్ కావడంతో చకచకా మిగతా నిర్మాణ పనుల్లో నిమగ్నం అయ్యాడు. అటు మహేష్ బాబు సరసన శ్రీమంతుడులో చారుశీలగా, ఇటు సెవెంత్ సెన్సులో మురుగదాస్ దర్శకత్వంలో పనిచేసిన అనుభవం కలిగిన శృతి హాసన్ తప్పకుండా బెస్ట్ సెలెక్షన్ అవుతుంది. సంక్రాంతి తరువాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.