Advertisementt

మనకెందుకు అనుకున్న కళ్యాణ్ రామ్

Mon 19th Oct 2015 04:33 AM
kalyan ram sher,sher release date,october 30,director mallikarjun  మనకెందుకు అనుకున్న కళ్యాణ్ రామ్
మనకెందుకు అనుకున్న కళ్యాణ్ రామ్
Advertisement
Ads by CJ

ఆరంభ చిత్రంతోనే అఖిల్ పండగ నుండి తప్పుకోవడంతో మూడు సినిమాలకు పచ్చ జెండా ఊపినట్టు అయింది. కంచె, రాజు గారి గది, కొలంబస్ అప్పుడే ప్రచారం కూడా మొదలెట్టాయి. అందుకే దసరాకి పోటీ పెరిగిపోవడంతో ఈ ఇరుకు సందులో మాకెందుకు అన్న ఫీలింగ్ కొద్ది నందమూరి కళ్యాణ్ రామ్ షేర్ పోటీ నుండి హాయిగా తప్పుకుంది. 

 

రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో క్రిష్ దర్శకత్వంలో రూపొందిన వరుణ్ తేజ్ కంచెకు దసరా పెద్ద పీట వెయనుంది. అద్భుతమైన విజువల్స్ ఇప్పటికే జనాన్ని కట్టి పడేశాయి. సినిమా మీద భారీ అంచనాలు ఉండడంతో విడుదల కూడా భారీగానే ఉంటుంది. అలాగే రాజుగారి హడావిడి కూడా చూడకుండా తప్పించుకునేది కాదు. సాయి కొర్రపాటి, అనిల్ సుంకరలు తోడవడంతో విడుదలకు థియేటర్ల డోఖా ఉండబోదు. కొలంబస్ కూడా థియేటర్లను కనిపెట్టేంత దుస్థితిలో లేడు. అందుకే మనకెందుకు అనుకున్న కళ్యాణ్ రామ్ షేర్ తన గాండ్రింపును నెలాఖరుకి ఆపుకుంది.           

 

పటాస్ ఇచ్చిన విజయోత్సాహంతో షేర్ మీద చేమట చిందించిన కళ్యాణ్ రామ్ తప్పకుండా మరో హిట్టు తన ఖాతాలో వేసుకోవాలని ఉవ్విల్లూరుతున్నాడు. అలాగే దర్శకుడు మల్లికార్జున్ కూడా అందివచ్చిన మూడో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నాడు. కొమర వెంకటేష్ నిర్మాతగా రానున్న షేర్ భవితవ్యం నెలాఖరుకు 30వ తేదీని తేలనుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ