Advertisementt

దసరా రోజే రవితేజ చిత్రం!

Sat 17th Oct 2015 08:37 AM
raviteja,venusriram,dil raju,evado okadu movie  దసరా రోజే రవితేజ చిత్రం!
దసరా రోజే రవితేజ చిత్రం!
Advertisement
Ads by CJ

మాస్ మహారాజా  రవి తేజ హీరో గా, మళయాళ చిత్రం ప్రేమం తో యువకుల మనసులు దోచుకున్న అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా త్వరలో ఎవడో ఒకడు అనే చిత్రం రాబోతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారి నిర్మాణ సారధ్యం లో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రం రాబోతోంది. ఓహ్ మై ఫ్రెండ్ చిత్రానికి దర్శకత్వం వహించిన వేణు శ్రీ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. అక్టోబర్ 22న, విజయ దశమి పర్వదినాన ఈ చిత్రం పూజా కార్యక్రమం జరుగుతుంది. రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుండి మొదలవుతుంది అని చిత్ర బృందం తెలిపింది. 

ఈ చిత్రానికి సంగీతాన్ని రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందిస్తారు. ఈ చిత్రం లో రవి తేజ గారిని ఒక కొత్త కోణం లో చూపిస్తాం అని దర్శకులు వేణు శ్రీ రామ్ తెలిపారు. ఎవడో ఒకడు చిత్రం లో యువత ను ఆకట్టుకునే అంశాలు చాలా ఉంటాయని, యువత ఆశయాలకు అద్దం పట్టే కథ అవుతుందని ఆయన అన్నారు.

రవి తేజ గారి తో భద్ర సినిమా తో సూపర్ హిట్ తీసాం. మళ్లీ ఇన్నాళ్ళకు ఆయనతో పని చేయటం, మా బ్యానర్ తో ఎంతో కాలం గా పరిచయం ఉన్న వేణు శ్రీ రామ్ తో, దేవి శ్రీ ప్రసాద్ తో పని చేయటం ఆనందం గా ఉంది అని నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఆర్య, బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, ఎవడు వంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన తమ బ్యానర్ లో ఇది మరొక మంచి చిత్రం అవుతుంది అన్న నమ్మకాన్ని అయన వ్యక్త పరిచారు. 

రవి తేజ, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, నాసర్, రావు రమేష్ ఈ చిత్రం లో ముఖ్య నటులు. 

కథ - స్క్రీన్ప్లే - దర్శకత్వం : వేణు శ్రీ రామ్ . కెమెరా : రిచర్డ్ ప్రసాద్ . సంగీతం : దేవి శ్రీ ప్రసాద్ . డైలాగ్స్ : రమేష్ , గోపి . ఎడిటర్ - శ్రీను . కో ప్రొడ్యూసర్స్ - శిరీష్, లక్ష్మణ్ .  నిర్మాత : దిల్ రాజు 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ