Advertisementt

అఖిల్ ఆలస్యానికి కారణం నాగ్ మాటల్లో!

Sat 17th Oct 2015 03:33 AM
akhil movie postponed,nagarjuna,sudhakar reddy,vinayak  అఖిల్ ఆలస్యానికి కారణం నాగ్ మాటల్లో!
అఖిల్ ఆలస్యానికి కారణం నాగ్ మాటల్లో!
Advertisement
Ads by CJ

అక్కినేని అఖిల్ ను హీరోగా పరిచయం చేస్తూ వినాయక్ దర్శకత్వం వహించిన చిత్రం అఖిల్. ఈ చిత్రాన్ని అక్టోబర్ 22న విడుదల చేస్తామని చిత్రబృందం వెల్లడించింది. అయితే కొన్ని కారణాల వలన సినిమా రిలీజ్ డేట్ వాయిదా వేసారు. ఈ విషయాన్ని శుక్రవారం ప్రెస్ మీట్ ను నిర్వహించి అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా..

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. నిజానికి అఖిల్ చిత్రాన్ని అక్టోబర్ 22న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేసాం. కాని గ్రాఫిక్స్ సరిగ్గా లేకపోవడం వలన వాయిదా వేయాల్సి వచ్చింది. అఖిల్ ను తెరపై చూడాలని ప్రేక్షకుల్లానే నేను కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నాను. సినిమా పోస్ట్ పోన్ అవుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ఇటీవల విడుదలయిన బాహుబలి చిత్రం గ్రాఫిక్స్ లో స్టాండర్డ్స్ ను ఫిక్స్ చేసింది. కేవలం గ్రాఫిక్స్ కోసం రాజమౌళి గారు సంవత్సరంన్నర సమయం తీసుకున్నారు. సో.. గ్రాఫిక్స్ విషయంలో ప్రేక్షకుల అంచనాలు భారీగా ఉంటాయి. అఖిల్ సినిమా నేను చూసిన తరువాత సీక్వెన్స్ గ్రాఫిక్స్ బాగా అనిపించలేదు. సినిమా అంతా బావుండి గ్రాఫిక్స్ బాలేదని ప్రేక్షకులు అనుకోవడం నాకిష్టం లేదు. అందుకే పోస్ట్ పోన్ చేయాలని సుధాకర్ రెడ్డి గారితో, వినాయక్ గారితో మాట్లాడాను. ఈ విషయాన్ని అఖిల్ కి నేనే చెప్పాను. తను చాలా సున్నితంగా రియాక్ట్ అయ్యాడు. మొదటి సినిమా బాగా రావాలి. మీరేం అనుకుంటే అది చేయండి డాడీ అని చెప్పాడు. పబ్లిసిటీ ఇంకా బాగా చేసుకోవచ్చనే పాజిటివ్ మైండ్ తో ఉన్నాడు. సినిమాలో అఖిల్ డాన్సులు చూసి ఆశ్చర్యపడ్డాను. మా ఇంట్లో ఇంత మంచి డాన్సర్ తిరుగుతున్నాడా.. అనుకున్నాను. ఈ సినిమా గ్రాఫిక్స్ టీం చాలా కష్టపడి పని చేసారు. కాని సమయం సరిపోక మేము అనుకున్న సమయానికి వర్క్ కంప్లీట్ అవ్వలేదు. 75% వర్క్ కంప్లీట్ అయింది. మిగిలిన 25% పూర్తిచేసి త్వరలోనే రిలీజ్ చేస్తాం. గ్రాఫిక్స్ మా చేతిలో పని కాదు కాబట్టి రిలీజ్ డేట్ కరెక్ట్ గా చెప్పలేకపోతున్నాం. సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం.. అని చెప్పారు.

వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. నేను కలగని తీసిన ప్రాజెక్ట్ ఇది. గ్రాఫిక్స్ టీం వారు కొంచెం సమయం కావాలని అడిగారు. అందుకే సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేయాల్సివచ్చింది. ప్రస్తుతం అక్కినేని అభిమానులు నిరాశ చెందినా అఖిల్ ను తెరపై చూసిన తరువాత రిలీజ్ లేట్ అయిందనే విషయం మర్చిపోతారు. ఒక వారం రోజుల తరువాత గ్రాఫిక్స్ షాట్ చూసి ఎప్పుడు రిలీజ్ చేస్తామనే విషయాన్ని చెబుతాం.. అని చెప్పారు.

సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సి.జి. వర్క్ లేట్ అవ్వడం వలన గత్యంతరం లేక సినిమాను వాయిదా వేసాం. ఇప్పటికే చిత్రమంతా కంప్లీట్ అయింది. నేను సినిమా చూసాను. ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది.. అని చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ