తేజ, తరుణ్, మాస్టర్ శ్రీరామ్ చంద్ర ప్రధాన పాత్రల్లో కృష్ణ మోహన్ గొర్రెపాటి దర్శకత్వంలో సిక్స్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ నిర్మాణ సారధ్యంలో రూపొందుతున్న చిత్రం కుర్ర తుఫాన్. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక శుక్రవారం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. చిత్ర ముహూర్తపు సన్నివేశానికి అచ్చిరెడ్డి క్లాప్ కొట్టగా, ఎస్.వి.కృష్ణారెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేసి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..
దర్శకుడు కృష్ణ మోహన్ మాట్లాడుతూ.. ఎస్.వి.కృష్ణారెడ్డి, పి.సి.అచ్చిరెడ్డి గారి వద్ద దర్శకత్వశాఖలో పని చేశాను. నా మిత్రుల సహకారంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఓ సైంటిఫిక్ లవ్ స్టొరీ ఇది. అవుట్ అండ్ అవుట్ కామెడీ తో రూపొందిస్తున్నాం. మంచి సస్పెన్స్ తో సినిమా అంతా సాగుతుంది. నా గురువుల పేరు చెడగొట్టకుండా జాగ్రత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాను. నవంబర్ మొదటివారంలో ఫస్ట్ షెడ్యూల్ మొదలుపెట్టనున్నాం. రెండు షెడ్యూల్స్ లో సినిమా పూర్తి చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం.. అని చెప్పారు.
తరుణ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో సెకండ్ హీరోగా నటిస్తున్నాను. యూత్ ఎంటర్టైనింగ్ చిత్రమిది. సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి నా ధన్యవాదాలు.. అని చెప్పారు.
రచ్చరవి మాట్లాడుతూ.. టైటిల్ కు తగ్గట్లుగానే సినిమా ఉంటుంది. ఫ్యామిలీ, యూత్ అన్ని వర్గాల ప్రేక్షకులు చూడగలిగే సినిమా ఇది.. అని చెప్పారు.
ఈ చిత్రానికి కెమెరా: గోపాల్ సామరాజు, సంగీతం: టి.పి.భరద్వాజ్, ఆర్ట్: కృష్ణ మాయ, ప్రొడక్షన్ మేనేజర్: కాశి, ఫైట్స్: కుంగ్ ఫు శేఖర్, ప్రొడక్షన్ డిజైనర్: మహేష్ తాళ్ళూరి, నిర్మాణం: సిక్స్ ఫ్రెండ్స్ క్రియేషన్స్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: కృష్ణ మోహన్ గొర్రెపాటి.