74 చిత్రాల అద్భుత హాస్య చిత్రాల దర్శకుడు రేలంగి నరసింహారావు నిర్దేశకత్వంలో నా ఫ్రెండ్స్ ఆర్ట్ మూవీస్ అధినేతలు మారెళ్ల నరసింహారావు, వడ్డెంపూడి శ్రీనివాసరావులు నిర్మిస్తున్న సంపూర్ణ హాస్య భరిత 75వ చిత్రం ఎలుకా మజాకా. నేటి స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ఎలుకగా ఒక ప్రధాన భూమికను పోషించగా, వెన్నెల కిషోర్, పావని జంటగా నటించారు. గ్రాఫిక్‌కు ఎక్కువగా ప్రాధాన్యత ఉన్న ఈ చిత్రం గ్రాఫిక్ వర్క్స్ ఇప్పటితో పూర్తయిందని అన్నారు నిర్మాతలు. ఈ సందర్భంగా
చిత్ర దర్శకులు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ.. మామూలుగా నా చిత్రాలు మూడు నాలుగు నెలల్లో పూర్తయి రిలీజ్‌కు వస్తాయి. కానీ ఈ చిత్రం గ్రాఫిక్ ప్రాధాన్యత ఉన్న చిత్రం కావడంతో ఎక్కువటైమ్ తీసుకుంది. రీ రికార్డింగ్ పూర్తయింది. డిటియస్ వర్క్ చివరి దశలో ఉంది. చిత్రాన్ని నవంబర్‌లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. గ్రాఫిక్స్‌ను ఒకటికి రెండు సార్లు చూసుకొని చేయటం వల్ల ఆలస్యమైంది. మామూలుగా కామెడీ సినిమాల్లో గ్రాఫిక్స్ పెద్దగా అవసరముండదు. కానీ ఈ చిత్రంలో సబ్జెక్ట్‌తోపాటు గ్రాఫిక్స్‌కు ఇంపార్టెన్స్ ఉంది. అలాగే ఇంత వరకు ఎలుక ప్రధానంగా సినిమా రాలేదు. ఒక తమాషా కథతో తయారైన ఈ చిత్రంలో ఎలుక మాట్లాడుతుంది. డాన్స్ చేస్తుంది. ఇలా ఎన్నో చేస్తూ మనల్ని నవ్విస్తుంది. ఎలుక బ్రహ్మానందంగా మారుతూ, బ్రహ్మానందం ఎలుకలోకి వెళ్తూ మంచి హాస్య సన్నివేశాలుంటాయి. ఇందులో బ్రహ్మానందం గారు ఎలుకగా చేస్తున్నారనగానే నీ సినిమా హిట్ పో అన్నారు గురువుగారు దాసరిగారు. ఊహించని విధంగా ఎలుక చేసే పనులకు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. చిత్ర నిర్మాతల గురించి ఎంతయినా చెప్పాలి. సినిమా క్వాలిటీగా రావడానికి నాకెంతో సహకరించారు. అలాగే ఆలస్యమైనా ఫరవాలేదంటూ గ్రాఫిక్స్‌కూ సహకరించారు. త్వరలోనే ఆడియో వేడుక ఉంటుంది.. అని అన్నారు.
ప్రముఖ రచయిత దివాకర్‌బాబు స్క్రీన్‌ప్లే సమకూర్చిన ఈ చిత్రానికి కెమెరా: నాగేంద్రకుమార్, మాటలు: గంగోత్రి విశ్వనాధ్, కో-డైరక్టర్: సి.వి.రమణబాబు, నిర్మాతలు:మారెళ్ల నరసింహారావు, వడ్డెంపూడి శ్రీనివాసరావు, కథ-దర్శకత్వం: రేలంగి నరసింహారావు.