Advertisementt

చిత్రం భళారే విచిత్రం ట్రైలర్ లాంచ్!

Sun 11th Oct 2015 06:41 AM
chithram bhalare vichithram trailer launch,chandini,manoj nandam  చిత్రం భళారే విచిత్రం ట్రైలర్ లాంచ్!
చిత్రం భళారే విచిత్రం ట్రైలర్ లాంచ్!
Advertisement
Ads by CJ

చాందిని, మనోజ్ నందం, అనిల్ కళ్యాణ్ ప్రధాన పాత్రల్లో భాను ప్రకాష్ బలుసు దర్శకత్వంలో ఉమాకాంత్ నిర్మిస్తున్న చిత్రం చిత్రం భళారే విచిత్రం. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఆదివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ సందర్భంగా..

నిర్మాత ఉమాకాంత్ మాట్లాడుతూ.. భాను ప్రకాష్ డైరెక్ట్ చేసిన ప్రయోగం మూవీ చూసి తనతో సినిమా చేయాలనుకున్నాను. హారర్ లో కామెడీ సినిమా కథ రాయమని చెప్పాను. ప్రస్తుతం హారర్ కామెడీ చిత్రాలకు మంచి ప్రేక్షకాదరణ లభిస్తోంది. రివెంజ్ స్టొరీ గా కాకుండా సినిమా కథ భిన్నంగా ఉంటుంది. ఇలాంటి స్క్రిప్ట్ ఇప్పటివరకు ఎవరు టచ్ చేయలేదు. ప్రస్తుతం సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటోంది. త్వరలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.. అని చెప్పారు.

దర్శకుడు భాను ప్రకాష్ మాట్లాడుతూ.. ఇదొక సినిమా బ్యాక్ డ్రాప్ లో జరిగే కామెడీ థ్రిల్లర్. కొంతమంది వ్యక్తులు సినిమా చేయాలనుకున్నప్పుడు వారికి కొన్ని విచిత్ర సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అలా కథ సాగుతూ ఉంటుంది. సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు చూడగలిగే చిత్రం. ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసే విధంగా ఉంటుంది. చాందిని బాగా నటించింది. అనిల్, మనోజ్ పోటీ పడి నటించారు. యాబై శాతం సినిమా మ్యూజిక్ మీదే ఆధారపడి ఉంటుంది. కనకేష్ మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. విజువల్ గా సినిమా బాగా రావడానికి సురేందర్ మంచి సహకారం అందించారు. గ్రాఫిక్స్ కు స్కోప్ ఉన్న సినిమా. అది కూడా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది.. అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ కనకేష్ రాథోడ్ మాట్లాడుతూ.. ప్రయోగం సినిమా దగ్గర నుండి నేను భాను గారితో ట్రావెల్ చేస్తున్నాను. ప్రయోగం చిత్రానికి కీబోర్డ్ ప్లేయర్ గా వర్క్ చేసాను. నా పనితనం నచ్చి ఈ సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశం ఇచ్చారు.. అని చెప్పారు. 

చాందిని మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాది చాలా ముఖ్యమైన పాత్ర. మొదటిసారిగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్నాను. నన్ను నమ్మి ఓ చాలెంజింగ్ రోల్ లో నటించే ఛాన్స్ ఇచ్చారు. అందరు ఎంతో ప్యాషన్ తో ఈ సినిమా చేసారు.. అని చెప్పారు.

మనోజ్ మాట్లాడుతూ.. సినిమా స్టొరీ వినగానే నాకు చాలా నచ్చింది. తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీ తో సినిమా చేసారు. మా ఇంట్లో అందరికి నచ్చిన కథ ఇది. ఇది నాకు ఎమోషనల్ ఫిలిం. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను.. అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో రుద్ర ప్రకాష్, భాష, రాము తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి ఆర్ట్: జె.కె.మూర్తి, ఎడిటింగ్: గోపి సిందం, విఎఫ్ఎక్స్: ప్రదీప్ పూడి, సంగీతం: కనకేష్ రాథోడ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాము వీరవల్లి, నిర్మాత: పి.ఉమాకాంత్, దర్శకత్వం: భానుప్రకాష్ బలుసు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ