డైనమిక్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా సాయి నిహారిక, శరత్‌చంద్ సమర్పణలో విజయలక్ష్మీ పిక్చర్స్ పతాకంపై మల్లికార్జున్ దర్శకత్వంలో కొమర వెంకటేష్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ షేర్. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్ లోని జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ సీడీను ఆవిష్కరించగా నందమూరి రామకృష్ణ ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి కాపీను దిల్ రాజు కు అందించారు. ఈ సందర్భంగా..
హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. సినిమా డిలే అయినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనుకడుగు వేయకుండా నిర్మించిన కొమర వెంకటేష్ గారికి ధన్యవాదాలు. మల్లికార్జున్ ని నేను ముద్దుగా రాజా అని పిలుస్తూ.. ఉంటాను. మల్లి తో నాకు ఇది మూడవ చిత్రం. చాలా మంది నన్ను మల్లి కి మూడో ఛాన్స్ ఎందుకు ఇస్తున్నావని అడిగారు. నేను కథను నమ్మి సినిమాలు చేస్తాను. ఈ సినిమాతో మల్లికి సక్సెస్ రావాలని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరికి సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేవి ఉంటాయి. నా కెరీర్ లో కూడా ఉన్నాయి. కాని ఒక్క హిట్టు పడితే అవన్నీ మర్చిపోతారు. నందమూరి ఫ్యామిలీ అందరూ ఒక్కటే. మేము ఎన్టీఆర్ అనే మహావృక్షం నుండి వచ్చాం. మమ్మల్ని వేరు చేసి మాట్లాడొద్దు. ఇప్పుడు మా ఫ్యామిలీ నుండి మోక్షజ్ఞ కూడా వస్తున్నాడు. అప్పుడు కూడా మేమంతా కలిసే ఉంటాం.. అని చెప్పారు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ.. అన్నయ్య ఏమయితే చెప్పాడో నేను కూడా అదే ఫాలో అవుతాను. మల్లికార్జున్ తో అన్నయ్య చేస్తున్న మూడో సినిమా ఇది. పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. నాకు తెలిసి ఈ సినిమా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. తమన్ ఏ సినిమాకైనా బెస్ట్ మ్యూజిక్ ఇస్తాడు. ఈ సినిమాకు కూడా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సమయంలో నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. నాన్నకు ప్రేమతో సినిమా షూటింగ్ మధ్యలో నేను ఇండియాకు వచ్చినప్పుడు కిక్2 ఆర్ధిక సమస్యల్లో ఉండడం వలన కొన్ని సంతకాలు పెట్టడానికొచ్చానని కొందరు వార్తలు రాసారు. నిజానికి అలాంటిదేమీ జరగలేదు. చనిపోయే వరకు కళ్యాణ్ అన్న చెయ్యి పైనే ఉంటుంది.. అని చెప్పారు.
దర్శకుడు మల్లికార్జున్ మాట్లాడుతూ.. కొమర వెంకటేష్ గారు గట్స్ ఉన్న నిర్మాత. ఇండస్ట్రీకి అలాంటి నిర్మాతలు చాలా అవసరం. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. రీరికార్డింగ్ అధ్బుతంగా ఉంటుంది. సినిమా బాగా వచ్చింది. కళ్యాణ్ రామ్ గారితో 12 సంవత్సరాలుగా ట్రావెల్ అవుతున్నాను. నన్ను నమ్మి ఆయన ఈ సినిమా చేసారు. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. అని చెప్పారు.
కొమర వెంకటేష్ మాట్లాడుతూ.. నేను ప్రొడ్యూస్ చేసే మొదటి సినిమా నందమూరి వారితో కావడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాసం ఇచ్చిన కళ్యాణ్ రామ్ గారికి కృతజ్ఞతలు.. అని చెప్పారు.
సోనాల్ చౌహాన్ మాట్లాడుతూ.. లెజెండ్ సినిమాతో నా కెరీర్ టర్న్ అయింది. నందమూరి ఫ్యామిలీ తో నాకు మంచి బాండ్ ఉంది. కళ్యాణ్ రామ్ గారితో కలిసి వర్క్ చేయడం ఆనందంగా ఉంది. చాలా సపోర్ట్ చేసారు.. అని చెప్పారు.
దిల్ రాజు మాట్లాడుతూ.. ఈ సంవత్సరంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మొదటి జెన్యూన్ హిట్ పటాస్. అప్పటినుండి కళ్యాణ్ గారిని గమనిస్తున్నాను. చాలా జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమా చేసారు. షేర్ సినిమా ట్రైలర్ చూసిన తరువాత సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని తెలుస్తుంది. తమన్ మ్యూజిక్ బావుంది. టీం అందరికి ఆల్ ది బెస్ట్.. అని చెప్పారు.
వక్కంతం వంశీ మాట్లాడుతూ.. సినిమా బాగా వచ్చిందని విన్నాను. మంచి హిట్ సాధించి ప్రొడ్యూసర్ కి లాభాలు రావాలని కోరుకుంటున్నాను. కళ్యాణ్ రామ్ గారు తాతగారి పేరుతో ఓ బ్యానర్ స్థాపించి విలువలు తగ్గకుండా సినిమాలు నిర్మిస్తున్నారు. ఆయనకు ఈ సినిమా మరో పటాస్ లా పేలాలని ఆశిస్తున్నాను.. అని చెప్పారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. పటాస్ సినిమా ద్వారా రెండు గొప్ప అనుభవాలు కలిగాయి. ఒకటి సెట్స్ లో ఎన్టీఆర్ గారితో ఎన్నో మర్చిపోలేని మూమెంట్స్, ఇంకొకటి సినిమా చూసి బాలకృష్ణ గారు నన్ను పిలిచి అప్రిషియేట్ చేయడం. కళ్యాణ్ క్లీన్ హార్ట్ పెర్సన్. రీసెంట్ గా నా రెండో సినిమా ఓపెనింగ్ కి వచ్చి నన్ను బ్లెస్ చేసారు. అలానే మొదటిరోజు షూటింగ్ కి వెళ్తున్నానని తెలుసుకొని ఫోన్ చేసి విష్ చేసారు. ఆయనకు ఈ సినిమా పటాస్ కంటే పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.
తమన్ మాట్లాడుతూ.. మంచి లిరిక్స్ అందించిన లిరిసిస్త్స్ అందరికి థాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమాలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది..అ ని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సి.కళ్యాణ్, దామోదర్ ప్రసాద్, షఫీ, రవికుమార్ చౌదరి, బ్రహ్మానందం, ప్రభాస్ శ్రీను, బి.ఏ.రాజు తదితరులు పాల్గొన్నారు.
డైనమిక్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్, సోనాల్‌చౌహాన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, రావు రమేష్, రోహిణి, షాయాజీ షిండే, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, ముఖేష్ రుషి, ఆశిష్ విద్యార్థి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి కథ-మాటలు: డైమండ్ రత్నబాబు, సంగీతం: థమన్ ఎస్.ఎస్., సినిమాటోగ్రఫీ: సర్వేష్ మురారి, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: సత్యశ్రీనివాస్, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, స్టిల్స్: మనీషా ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: హరీష్‌రెడ్డి యల్లన్నగారి, మేనేజర్స్: బోడంపాటి శ్రావణ్‌కుమార్ గౌడ్, కురిమెండ్ల రవీంద్రగౌడ్, మేకప్: మోహనరావు, కాస్ట్యూమ్స్: శ్రీను, పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే, ఛీఫ్ కోడైరెక్టర్: బూరుగుపల్లి సత్యనారాయణ, కోడైరెక్టర్: శేషు బలగ, లైన్ ప్రొడ్యూసర్స్: దేవినేని బ్రహ్మానందరావు, బండి రత్నకుమార్, సమర్పణ: సాయి నిహారిక, శరత్‌చంద్, నిర్మాత: కొమర వెంకటేష్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: మల్లికార్జున్.