Advertisementt

పులి ఇంత హిట్ అవుతుందనుకోలేదు..!

Sat 10th Oct 2015 06:53 AM
puli movie,shobharani,vijay,sruthihassan,hansika,sridevi  పులి ఇంత హిట్ అవుతుందనుకోలేదు..!
పులి ఇంత హిట్ అవుతుందనుకోలేదు..!
Advertisement
Ads by CJ
ఇలయదళపతి విజయ్‌ హీరోగా అతిలోక సుందరి శ్రీదేవి కీలకపాత్రలో, శ్రుతిహాసన్‌, హన్సిక కథానాయికలుగా చింబుదేవన్‌ దర్శకత్వంలో శిబుతమీన్స్‌, పి.టి.సెల్వకుమార్‌ నిర్మించిన పులి చిత్రం తెలుగు, తమిళ్‌లో రిలీజై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్‌.వి.ఆర్‌.మీడియా సమర్పణలో శోభారాణి రిలీజ్‌ చేశారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా..
నిర్మాత  శోభారాణి మాట్లాడుతూ.. మా సంస్థ నుంచి వచ్చిన పులి హిట్‌ టాక్‌తో దూసుకెళుతోంది. తెలుగులో ఒకరోజు ఆలస్యంగా రిలీజైనా ప్రేక్షకుల అంచనాల్ని అందుకుని పెద్ద విజయం సాధించింది. ఈ సినిమా రిలీజ్ కు థియేటర్ల  సమస్య వస్తే ఏషియన్ ఫిలిం నారంగ్ థియేటర్లు ఇప్పించి సహకారం అందించారు. విజయ్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. సినిమాలో సాంగ్స్, కామెడీ సీన్స్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు. సెకండ్ హాఫ్ లో శ్రీదేవి గారు తన భుజాలపై సినిమా అంతా నడిపించారు. హన్సిక, శ్రుతిహాసన్‌ల గ్లామర్‌, నటన పెద్ద అస్సెట్‌. మకుట సంస్థ విజువల్‌ గ్రాఫిక్స్‌ పనితనం సూపర్భ్‌ అని అంటున్నారు. మకుట సంస్థకి, ఈ సినిమాని మాకు ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్‌. పులి చిత్రం మాకు దక్కడానికి, ఇప్పుడు రిలీజ్‌ కావడానికి నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు గారు, ప్రసన్నగారు, అజయ్‌ గారు సాయం చేశారు. దేవీశ్రీ పస్రాద్‌ సంగీతం సినిమాకి పెద్ద ప్లస్‌. ఆయన కెరీర్ లోనే బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి అందించారు. రిలీజ్ అయ్యి రెండవ వారమయినా 100 థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. అని చెప్పారు.
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ