నాగాన్వేష్, కృతిక జంటగా సరస్వతి ఫిల్మ్స్ పతాకంపై జి.రామ్ ప్రసాద్ దర్శకత్వంలో సింధూరపువ్వు కృష్ణారెడ్డి నిర్మించిన సినిమా వినవయ్యా రామయ్యా. ఈ చిత్రం వైజాగ్ లోని విమ్యాక్స్ థియేటర్ లో విజవంతంగా 50 రుజులు ప్రదర్శింపబడింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో..
సింధూరపువ్వు కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్న పరిస్థితుల్లో కొత్త హీరోతో చిన్న బడ్జెట్ లో సినిమా తీసి దాన్ని రిలీజ్ చేయడానికే కష్టంగా ఉంది. కాని మా చిత్రం మాత్రం 35 థియేటర్లలో మూడు వారాలు సక్సెస్ ఫుల్ గా రన్ అయింది. అది కాకుండా వైజాగ్ విమ్యాక్స్ థియేటర్ లో 50 రోజులపాటు విజయవంతంగా ప్రదర్శింపబడింది. చిన్న సినిమా అయినా ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు.. అని చెప్పారు.
వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. నాగాన్వేష్ ప్రొడ్యూసర్ కొడుకుని అని కాకుండా సినిమా కోసం అన్ని విధాలుగా ట్రైనింగ్ తీసుకొని నటించాడు. డాన్సులు బాగా చేసాడు. మా థియేటర్ లో జెన్యూన్ గా 50 రోజులు పూర్తి చేసుకొంది. నాగాన్వేష్ కు మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తున్నాను.. అని చెప్పారు.
మారుతి మాట్లాడుతూ.. కృష్ణారెడ్డి గారు ఎంతో ప్యాషన్ తో సినిమా చేసారు. తండ్రిలా కాకుండా ఓ మంచి సినిమా తీయాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నాగాన్వేష్ లో మంచి ఎనర్జీ ఉంది. సినిమాలో డాన్సులు ఇరగదీసాడు. కృతిక, నాగాన్వేష్ ల జంట బాగా సక్సెస్ అయింది.. అని చెప్పారు.
నాగాన్వేష్ మాట్లాడుతూ.. మూవీ రిలీజ్ అయినప్పుడు కంటే మంచి రెస్పాన్స్ వచ్చినప్పుడు కంటే 50 రోజులు సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నన్ను చాలా మంది డైరెక్టర్ అప్రోచ్ అయ్యారు. తెలుగులో రెండు చిత్రాలకు, తమిళంలో ఓ సినిమా చేయడానికి సైన్ చేసాను. . అని చెప్పారు.
రామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. సినిమా రిలీజ్ అయిన మొదటి వారంలోనే వినాయక్ గారు ఇది ఖచ్చితంగా 50 రోజులు ఆడుతుందని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే జరిగింది. ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు.. అని చెప్పారు.