శ్రీరాజన్, ప్రశాంతి, గీతాంజలి ప్రాధాన పాత్రల్లో భీమవరం టాకీస్ బ్యానర్ పై శ్రీరాజన్ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న సినిమా ఎఫైర్. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రామ్ గోపాల్ వర్మ, నటుడు ప్రభాకర్, సి.కళ్యాణ్ సంయుక్తంగా బిగ్ సీడీను ఆవిష్కరించారు. రామ్ గోపాల్ వర్మ ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి కాపీను మ్యూజిక్ డైరెక్టర్ శేషు కి అందించారు. ఈ సందర్భంగా..
రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ఎఫైర్ కొత్త రకమైన సబ్జెక్టు. అసాధారణమైన రిలేషన్షిప్ తో ఈ సినిమా తీసారు. మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.
సి.కళ్యాన్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది. టెక్నీషియన్స్ అందరికి మంచి పేరు వస్తుంది.. అని చెప్పారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. శ్రీ రాజన్ ను కో డైరెక్టర్ గా రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర జాయిన్ చేద్దామని వెళ్లాను. ఆయన శ్రీరాజన్ చెప్పిన కథ విని తనలో మంచి టాలెంట్ ఉందని తనే డైరెక్టర్ గా సినిమా చేయమని నాకు చెప్పారు. శ్రీరాజన్ కు ఈ సినిమాతో మంచి బ్రేక్ వస్తుంది. ప్రతి ఒక్కరు కష్టపడి ఈ సినిమా చేసారు. సినిమా సెన్సార్ కు చాలా సమస్యలు వచ్చాయి. సి.కళ్యాన్ గారి సపోర్ట్ తో సింగల్ కట్ లేకుండా సెన్సార్ ఓకే అయింది.. అని చెప్పారు.
శ్రీరాజన్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం వర్మ గారు చెప్పిన సజెషన్స్ ఎంతగానో ఉపయోగపడ్డాయి. విజయవంతంగా సినిమా మొత్తం పూర్తి కావడానికి ప్రతి టెక్నీషియన్ బాగా సహకరించారు.. అని చెప్పారు.
ప్రభాకర్ మాట్లాడుతూ.. శ్రీరాజన్ తో నాకు 15 ఏళ్ళుగా మంచి పరిచయముంది. యాక్టర్ గా, సింగర్ గా, కామెడీ రైటర్ గా తను నాకు బాగా తెలుసు. ఇది డైరెక్టర్ గా తనకు రెండో సినిమా. ట్రైలర్ చూస్తుంటే సినిమాను ఎంత బాగా డైరెక్ట్ చేసాడో తెలుస్తుంది. గొప్ప పాయింట్ తీసుకొని సినిమా చేసాడు. ఖచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది.. అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో శేషు, కర్ణ, ప్రశాంతి, గీతాంజలి, సోమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి ఎడిటింగ్: సోమేశ్వర్ పోచం, కెమెరా: కర్ణ ప్యారసాని, డి.ఐ-విజువల్ ఎఫెక్ట్స్: రఘు, డైలాగ్స్: అనిల్ సిరిమల్ల, మ్యూజిక్: శేషు కె.ఎం.ఆర్, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీరాజన్.