Advertisementt

రుద్రమదేవి రిలీజ్ డేట్ కన్ఫర్మ్!

Mon 05th Oct 2015 02:27 AM
rudhramadevi release date,gunasekhar,anushka,allu arjun  రుద్రమదేవి రిలీజ్ డేట్ కన్ఫర్మ్!
రుద్రమదేవి రిలీజ్ డేట్ కన్ఫర్మ్!
Advertisement
Ads by CJ

అనుష్క ప్రధాన పాత్రలో టైటిల్‌ రోల్‌లో గుణా టీమ్‌ వర్క్స్‌ పతాకంపై శ్రీమతి రాగిణీ గుణ సమర్పణలో డైనమిక్‌ డైరెక్టర్‌ దర్శక నిర్మాతగా రూపొందుతున్న భారతదేశపు తొలి హిస్టారికల్‌ స్టీరియోస్కోపిక్‌ 3డి ద్విభాషా చిత్రం రుద్రమదేవి. ఈ సినిమా రిలీజ్‌కి సంబంధించి ఎన్నో డేట్స్‌ అనుకున్నప్పటికీ ఫైనల్‌గా అక్టోబర్ 9న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆదివారం హైదరాబాద్ లోని విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో..

గుణశేఖర్ మాట్లాడుతూ.. ఈ చిత్రం ఓ ఎపిక్ డ్రామా. 13 వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కథను ఏ మాత్రం వక్రీకరించకుండా తెరకెక్కించాం. రుద్రమదేవి చరిత్ర గురించి ఎన్నో పుస్తకాలు చదివాను. కొన్ని పుస్తకాల్లో కన్ఫ్యూజన్స్ ఉండడంవలన రీసెర్చ్ టీం ఏర్పాటు చేసుకున్నాను. తోటప్రసాద్, మధు బాబు ఇలా ఎందరో సలహాలు సూచనలు తీసుకున్నాను. ముఖ్యంగా ముదిగొండ ప్రసాద్ గారు ఎంతగానో సహకరించారు. కేవలం పుస్తకాల మీదే ఆధారపడకుండా కాకతీయుల కాలంనాటి శిలాశాసనాలను ప్రేరణగా తీసుకొని కథను రూపొందించాను. ఈ కథ నిడివి రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలు. గొప్ప స్పూర్తినిచ్చే చరిత్రను కేవలం రెండు గంటల సమయంలో చూపించడం చాలా కష్టమైన విషయం. ఎంతో సాహసంతో కూడుకున్న పనది. అయితే ఈ చరిత్ర ద్వారా నేను ప్రభావితం అయిన విషయాలను ప్రాధాన్యంగా తీసుకొని ప్ర్రేక్షకులను ప్రభావితం చేసే విధంగా కథను మలిచాను. రుద్రమదేవి కాకతీయుల ప్రజల కోసం చేసిన త్యాగాలను, 40 ఏళ్ళ పాటు ఆరోజుల్లో ఓ స్త్రీ అయిన ఆమె పరిపాలించిన విధానాన్ని ఈ సినిమాలో చూపించాం. పీరియాడిక్ సినిమా తీయాలనే ఆలోచనతోనో లేక గ్రాఫిక్స్ ఎక్కువగా చూపించాలనే సరదాతోనో నేను ఈ సినిమా చేయలేదు. కథను నమ్ముకొని సినిమా చేసాను. ఆ కథను చెప్పే ఆర్టిస్టులను ఒప్పించాను. ఆ కథ నచ్చే నిర్మాణ కార్యక్రమాల్లో ఉన్నప్పుడే సినిమాను ఇతర భాషల్లో అనువదించడానికి పలువురు ఆసక్తి చూపించారు. ఈ సినిమా కోసం నేను డెబ్బై కోట్లు ఖర్చుపెడుతున్నానని తెలిసి కొందరు కాకతీయుల గుప్తనిధులు గుణశేఖర్ కు దొరికాయేమో అందుకే ఈ సినిమా ఇంత ఖర్చు పెట్టి తీస్తున్నాడని అన్నారు. అవును.. నిజంగానే నాకు కాకతీయుల గుప్తనిధి దొరికింది. అది రుద్రమదేవి చరిత్రనే. ఆ కథను అందరికి చెప్పే భాద్యతను నేను తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా అందరికి ఆదర్శం కావాలి. దర్శకునిగా నేను అనుకున్న విషయంలో కాంప్రమైజ్ కాకుండా సినిమా చేసాను. చిత్ర నిర్మాణ బాధ్యతలు నా భార్యే దగ్గరుండి చూసుకుంది.  ఇళయరాజా నేతృత్వంలో సింఫనీ ఆర్కెస్ట్రాతో 25 రోజులపాటు లండన్‌లో ఈ రీ రికార్డింగ్‌ కార్యక్రమాలు జరిగాయి. లండన్‌లో రీరికార్డింగ్‌ జరుపుకున్న తొలి తెలుగు చిత్రమిది. ఇళయరాజా గారి నేపధ్యసంగీతం లైవ్ లో ఆర్కెస్ట్రా చూసే భావన కలుగుతుంది. ఈ సినిమాకు ఆర్టిస్టుల సహకారం మరువలేనిది. ప్రకాష్ రాజ్, రానా, అనుష్క కీలకమైన సమయంలో అల్లు అర్జున్ ఇలా ప్రతి ఒక్కరూ ఎంతగానో సహకరించారు. ముఖ్యంగా కృష్ణంరాజు గారు మంచి చారిత్రక సినిమా చేస్తున్నానని అభినందించారు. అనుష్క లేకపోతే  రుద్రమదేవి లేదు. మూడు సంవత్సరాలుగా తను ఈ సినిమా కోసం పని చేస్తూనే ఉంది. రానా చాణక్య వీరభద్రుడి పాత్రలో నటించాడు. తను ఎంత మోడరన్ గా ఉంటాడో లిటరేచర్ మీద అంత పట్టు ఉంది. ఈ సినిమాతో నాకు ఎలాంటి ఇమేజ్ వస్తుంది అని లెక్కలు వేసుకోకుండా.. నా వెన్నంటే ఉండి ఎంతగానో సపోర్ట్ చేసాడు. రానాలో సరికొత్త రొమాంటిక్ యాంగిల్ ను ఈ సినిమాలో చూడబోతున్నారు. అనుష్క, రానా జంట స్క్రీన్ పై బావుంటుంది. బాహుబలి సినిమాకు ముందే రుద్రమదేవి చిత్రం మొదలయ్యింది. ఆ సినిమా రిలీజ్ కు ముందే మా సినిమా బిజినెస్ దాదాపుగా పూర్తయింది. కాకపోతే ఆ సినిమాతో కొత్తఒరవడి పలికింది. బాహుబలి విజయం కారణంగానే రుద్రమదేవి హిందీలో మార్కెట్ చేసేందుకు అవకాసం లభించింది. ఆ క్రెడిట్ అంతా వంద శాతం బాహుబలిదే. ఈ సినిమా కథ నేరేట్ చేయడానికి మంచి వాయిస్ కావాలని బన్నీ తో చర్చించినప్పుడు తను మెగాస్టార్ చిరు గారిది అయితే ఎలా ఉంటుందనే సలాహా ఇచ్చాడు. వెంటనే ఆయనను సంప్రదించాను. ఆయన కథ పూర్తిగా వినకుండానే వాయిస్ అందించడానికి అంగీకరించారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. యు/ఏ సర్టిఫికేట్ పొందింది. సినిమా సెన్సార్ రెండు సార్లు అయ్యిందనే వార్తలు వినిపించాయి. నిజానికి మొదట సినిమా ట్రైలర్ కు సెన్సార్ జరిగింది. అదే మొత్తం సినిమా సెన్సార్ అని అందరూ అనుకున్నారు. సినిమాకు సంబంధించి సెన్సార్ ఒక్కసారే జరిగింది. అక్టోబర్ 9న 2 డి, 3 డి ఫార్మాట్ లో కూడా సినిమా ఒకేరోజు విడుదల కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సినిమా విడుదలవుతుంది. ఒక్కడు సినిమా విషయంలో ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నానో.. ఈ సినిమాపై కూడా అంతే కాన్ఫిడెంట్ గా ఉన్నాను. కమర్షియల్ హిట్ వస్తుందని ఆశిస్తున్నాను.. అని చెప్పారు.

అనుష్క మాట్లాడుతూ.. సుమారుగా ఈ సినిమా కోసం రెండున్నర సంవత్సరాల సమయం పట్టింది. ఎంత ప్యాషన్ తో మొదలుపెట్టామో.. అంతే ప్యాషన్ తో కంప్లీట్ చేసాం. ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు. 

రానా మాట్లాడుతూ.. నన్ను ఎవరైనా మహాభారతంలో శ్రీకృష్ణుడు ఎలా ఉంటారని అడిగితే రామారావు గారిలా ఉంటారని, అల్లూరి సీతారామారాజు గారు ఎలా ఉంటారు అంటే కృష్ణ గారిలా ఉంటారని చెప్తాను. మనుషులపై చాలా ప్రభావం చూపే మీడియం సినిమా. చారిత్రక సినిమాలంటే నాకు చాలా ఇష్టం. 2006, 2007 సంవత్సరంలో గుణశేఖర్ గారి దగ్గర ఈ సినిమా కథ విన్నాను. ఆ సినిమాలో నాకు నటించే అవకాశం రావడం అద్రుష్టంగా భావిస్తున్నాను. నెక్స్ట్ జనరేషన్స్ లో మాత్రం రుద్రమదేవి ఎలా ఉంటుందని ఎవరిని అడిగినా అనుష్క పేరే చెప్తారు.. అని చెప్పారు.

అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నేను అన్ని రకాలా చిత్రాలను ఇష్టపడతాను. మంచి ఇంటెన్షన్ తో మంచి సినిమా తీసిన గుణశేఖర్ గారిని అభినందించాలి. మొత్తం సౌత్ లో ఈ సినిమా చేయగలిగే పర్సన్ అనుష్క మాత్రమే. ఎంతో కష్టపడి ఈ సినిమా కోసం పని చేసింది. తను చేసే హార్డ్ వర్క్, ప్రాజెక్ట్ పట్ల తను చూపించే డెడికేషన్ మరే ఏ అమ్మాయి చేయలేదు. రానా బాహుబలి కి ముందే ఈ సినిమా ఓకే చేసాడు. ఇలాంటి సినిమాలు రావాలని ఎంతో ప్రోత్సహించాడు. ఈ సినిమాలో నేను గోనగన్నారెడ్డి పాత్రలో నటించాను. ఆ పాత్ర కోసం స్వచ్చమైన తెలంగాణా మాట్లాడాను. సినిమాల్లో తెలంగాణా సినిమాటిక్ గానే ఉంటుంది. కాని నిజమైన తెలంగాణా భాషా బావుంటుంది. రూరల్ తెలంగాణా మాట్లాడని ఫిక్స్ అయ్యాను. దానిపై కొంత హోం వర్క్ చేసాను. ఈ పాత్రలో నేను నటించడం మంచి అవకాశంగా భావిస్తున్నాను. ఇంతకముందు ఎన్టీఆర్, నాగేశ్వరావు లాంటి పెద్ద హీరోలు మంచి పాత్ర అయితే చాలు వ్యవధి తక్కువ అయినా నటించేవారు. తమిళంలో రజినీకాంత్ లాంటి స్టార్ హీరోల దగ్గర కూడా నేను అది గమనించాను. రుద్రమదేవి సినిమాతో తెలుగులో మళ్లీ అలాంటి రోజులు రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా నేను ఓకే చేసినప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో నటిస్తున్నాను. త్రివిక్రమ్ గారితో రుద్రమదేవిలో నటించడానికి అంగీకరించానని చెప్పిన వెంటనే నెల రోజులు మన సినిమా షూటింగ్ లేట్ అయినా పర్వాలేదని చెప్పి నన్ను రుద్రమదేవి నటించమని ప్రోత్సహించారు. రుద్రమదేవి నేను ఓకే చేసిన తరువాత చాలా మంది దర్శకుల దగ్గర నా గౌరవం పెరిగింది.. అని చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ