Advertisementt

దశావతారం, తుపాకి తర్వాత పులి!

Sun 04th Oct 2015 04:59 AM
puli movie,shobharani,vijay,hansika,sruthihassan  దశావతారం, తుపాకి తర్వాత పులి!
దశావతారం, తుపాకి తర్వాత పులి!
Advertisement
Ads by CJ

దశావతారం, తుపాకి తర్వాత పులి మా సంస్థలో మరో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ - ఎస్‌.వి.ఆర్‌ మీడియా అధినేత శోభారాణి 

ఇలయదళపతి విజయ్‌ హీరోగా అతిలోక సుందరి శ్రీదేవి కీలకపాత్రలో, శ్రుతిహాసన్‌, హన్సిక కథానాయికలుగా చింబుదేవన్‌ దర్శకత్వంలో శిబుతమీన్స్‌, పి.టి.సెల్వకుమార్‌ నిర్మించిన పులి చిత్రం తెలుగు, తమిళ్‌లో రిలీజై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్‌.వి.ఆర్‌.మీడియా సమర్పణలో శోభారాణి రిలీజ్‌ చేశారు. పులి తెలుగు వెర్షన్‌ ఘనవిజయం సాధించిన సందర్భంగా దాదాపు 250 థియేటర్లను అదనంగా పెంచుతున్నామని శోభారాణి ప్రకటించారు. 

సక్సెస్‌ మీట్‌లో శోభారాణి మాట్లాడుతూ.. మా సంస్థ నుంచి వచ్చిన పులి హిట్‌ టాక్‌తో దూసుకెళుతోంది. తెలుగులో ఒకరోజు ఆలస్యంగా రిలీజైనా ప్రేక్షకుల అంచనాల్ని అందుకుని పెద్ద విజయం సాధించింది. మా సంస్థ నుంచి వచ్చిన దశావతారం, తుపాకి తర్వాత మరో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇది. ఇంత పెద్ద హిట్‌ ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులకు థాంక్స్‌. పులి ఓ విజువల్‌ వండర్‌. పిల్లలు, ఫ్యామిలీస్‌ ఎగబడి థియేటర్లలో చూస్తున్నారు. ఇటీవలి కాలంలో రోబో పెద్ద హిట్‌ అవ్వడానికి పిల్లలు, ఫ్యామిలీస్‌ ఆదరించడం వల్లే. తెలుగులో లవకుశ అప్పట్లో అంత పెద్ద విజయం సాధించింది. మా సంస్థ నుంచి దశావతారం రిలీజ్‌ చేసినప్పుడు ఆ సినిమా గురించి అందరూ మాట్లాడారు. పరిశ్రమ వ్యక్తులు, ప్రేక్షకుల నుంచి మంచి టాక్‌ వచ్చింది. ఇప్పుడు కూడా అలానే మాట్లాడుకుంటున్నారు. రిలీజైన ప్రతిచోటా హౌస్‌ఫుల్స్‌తో మా చిత్రం నడుస్తోంది. సినిమాలో శ్రీదేవి మైండ్‌ బ్లోవింగ్‌ పెర్ఫామెన్స్‌, విజయ్‌ ఔట్‌ స్టాండింగ్‌ పెర్ఫామెన్స్‌, యాక్షన్‌కి గొప్ప అప్లాజ్‌ వస్తోంది. మరుజ్జుల ఎపిసోడ్స్‌ బాగా పండాయి. సుదీప్‌ విలనీ, హన్సిక, శ్రుతిహాసన్‌ల గ్లామర్‌, నటన పెద్ద అస్సెట్‌. మకుట సంస్థ విజువల్‌ గ్రాఫిక్స్‌ పనితనం సూపర్భ్‌ అని అంటున్నారు. మకుట సంస్థకి, ఈ సినిమాని మాకు ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్‌. అలాగే దేవీశ్రీ పస్రాద్‌ సంగీతం సినిమాకి పెద్ద ప్లస్‌. మంచి హిట్‌ సాంగ్స్‌ ఇచ్చారు. ఏ భాష నుంచి వచ్చినా మంచి సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు ఎల్లపుడూ ఆదరిస్తారు అనడానికి మా పులి ఓ ఉదాహరణ. తమిళ్‌, మలయాళ చిత్రాలెన్నో తెలుగులోనూ విజయం సాధించడానికి మంచి కంటెంట్‌ కారణం.. అని అన్నారు. 

ఎగ్జిబిటర్స్‌, డిస్ట్రిబ్యూటర్స్‌కి థాంక్స్‌ మునుముందు మరిన్ని మంచి సినిమాల్ని మా సంస్థ అందిస్తుంది. పులి చిత్రం మాకు దక్కడానికి, ఇప్పుడు రిలీజ్‌ కావడానికి నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు గారు, ప్రసన్నగారు, అజయ్‌ గారు సాయం చేశారు. అందరికీ థాంక్స్‌. ఈ సినిమా భారీ రిలీజ్‌కి సహకరించిన ఎగ్జిబిటర్స్‌, పంపిణీదారులు అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు.. అన్నారు శోభారాణి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ