Advertisementt

మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న తొలి కిరణం..!

Tue 29th Sep 2015 10:26 AM
tholikiranam movie,jhon babu,sudhakar,abhinaya  మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న తొలి కిరణం..!
మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న తొలి కిరణం..!
Advertisement
Ads by CJ
సువర్ణ క్రియేషన్స్ పతాకంపై పి.డి.రాజు ప్రధాన పాత్రలో జె.జాన్ బాబు దర్శకత్వంలో టి.సుధాకర్ నిర్మిస్తున్న సినిమా తొలి కిరణం. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకొంది. ఈ సందర్భంగా..
దర్శకుడు జె.జాన్ బాబు మాట్లాడుతూ.. మొదటి షెడ్యూల్ లో భాగంగా సారధి స్టూడియో, భూత్ బంగ్లాలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్టింగ్స్ మధ్య 15 రోజుల పాటు ఏకదాటిగా జరిగిన షూటింగ్ తో మొదటి షెడ్యూల్ తో పూర్తయింది. జీసస్ కాలం నాటి పరిస్థితులను యధాతదంగా, సహజంగా చిత్రీకరిస్తున్నాం. రెండవ షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో ఇరవై రోజులపాటు, మూడవ షెడ్యూల్ గోవా, ఇజ్రాయిల్ దేశంలో చిత్రీకరించి పోస్ట్ ప్రొడక్షన్ అనంతరం క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయనున్నాం.. అని చెప్పారు.
సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ.. చాలా కాలం నుండి జీసస్ చిత్రానికి సంగీతం అందించాలనే కోరిక తొలికిరణం చిత్రం ద్వారా నెరవేరినందుకు ఆనందంగా ఉంది. ఇప్పటికే మూడు పాటలను రికార్డ్ చేసాం. మొత్తం ఎనిమిది పాటలకు అధ్బుతమైన సంగీతాన్ని అందించాను.. అని చెప్పారు.
నిర్మాత సుధాకర్ మాట్లాడుతూ.. సాంకేతికపరంగా ఎక్కడ రాజీలేకుండా, భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. దర్శకుడు జాన్ బాబు అధ్బుతంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో నిర్మిస్తున్నాం.. అని చెప్పారు.
అభినయ మాట్లాడుతూ.. ఈ చిత్రంలోని నా పాత్ర కెరీర్ లో అధ్బుతమైన గీటురాయిగా నిలుస్తుంది.. అని చెప్పారు.
ఈ చిత్రానికి కథ-పాటలు: రెవరెండ్ టి.ఎ. ప్రభుకిరణ్, రచన సహకారం:వి.ఎం.ఎం.ప్రవీణ్, సంగీతం: ఆర్.పి.పట్నాయక్, కెమెరా: మురళీకృష్ణ, ఎడిటింగ్: వినయ్, నిర్మాత: టి.సుధాకర్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జె.జాన్ బాబు.
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ