Advertisementt

స్టార్ హీరోల లిస్టులోకి సుబ్రమణ్యం!

Tue 29th Sep 2015 03:35 AM
subramanyam for sale success meet,dil raju,hareesh shankar,sai dharam tej  స్టార్ హీరోల లిస్టులోకి సుబ్రమణ్యం!
స్టార్ హీరోల లిస్టులోకి సుబ్రమణ్యం!
Advertisement
Ads by CJ

మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌, రెజీనా జంటగా హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాతగా రూపొందించిన చిత్రం సుబ్రమణ్యం ఫర్‌సేల్‌. ఇటీవల విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోమవారం హైదరాబాద్ లోని సక్సెస్ మీట్ తో పాటు ప్లాటినం డిస్క్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా..

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. సెప్టెంబర్ 24న విడుదలయిన సుబ్రమణ్యం ఫర్ సేల్ ఈరోజుకి అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. తేజు కి ఇది మూడవ సినిమా. తన మూడవ చిత్రానికే స్టార్ హీరో రేంజ్ లో ఓపెనింగ్స్ వచ్చాయి. హరీష్ మా బ్యానర్ లో ఓ హిట్ సినిమా చేయాలనే పట్టుదలతో ఈ సినిమా చేసాడు. టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అధ్బుతమైన మ్యూజిక్ ఇచ్చిన మిక్కి జె మేయర్ కు స్పెషల్ థాంక్స్. మా సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు.. అని చెప్పారు.

హరీష్ శంకర్ మాట్లాడుతూ.. రామయ్య వస్తావయ్య చిత్రం తరువాత దిల్ రాజు గారు సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ గురించి ఆలోచించకు. నెక్స్ట్ స్క్రిప్ట్ రెడీ చేస్కో సినిమా చేద్దామన్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా మనిషి టాలెంట్ ను నమ్మే వ్యక్తి. ఆయన ఇచ్చిన సపోర్టే సుబ్రమణ్యం ఫర్ సేల్ సక్సెస్ కు కారణం. హర్షిత్ కు ఈ సినిమా సెకండ్ ప్రొడక్షన్. అమెరికా లో షూట్ అంత బాగా రావడానికి కారణం తనే. ప్రతిది దగ్గరుండి చూసుకున్నాడు. నా సినిమాలో భాస్కర్ భట్ల గారు ఇంటర్వెల్ కు ముందు, చంద్రబోస్ గారు సినిమాలో రెండో పాటను రాస్తారు. వారిద్దరూ రాసిన పాటలకు మంచి అప్లాజ్ వస్తుంది. ముఖ్యంగా తెలుగు మీద రాసిన పాటకు అందరూ కనెక్ట్ అవుతున్నారు. మిక్కి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయింది. తేజు సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తను డాన్సులు, డైలాగులు ప్రతిదాంట్లో కేర్ తీసుకొని చేసాడు. ఈ సినిమాతో స్టార్ హీరో అయిపోయాడు. సూపర్ హిట్ టాక్ నుండి బ్లాక్ బస్టర్ లిస్టు లోకి సినిమా చేరుతుంది అని చెప్పడానికి ఆనందంగా ఉంది.. అని చెప్పారు.

సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను నటించడానికి ఇద్దరు ఫ్రెండ్స్ కారణం. వారిద్దరికీ కృతజ్ఞతలు. వారు చెప్పిన మాట వినకపోతే చాలా మిస్ అయ్యేవాడ్ని. ఈ సినిమా కోసం నన్ను సెలెక్ట్ చేసిన హరీష్ అన్నకు థాంక్స్. ఈ సినిమా ద్వారా ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. ప్రతి విషయంలో నన్ను గైడ్ చేసేవారు. స్క్రీన్ పై నన్ను అందంగా చూపించిన రామ్ ప్రసాద్ గారికి మంచి డైలాగ్స్ రాసిన స్క్రీన్ ప్లే రైటర్స్ కు థాంక్స్. గౌతంరాజు గారితో నా మొదటి సినిమా నుండి ట్రావెల్ అవుతున్నాను. న కెరీర్ మొదట్లోనే ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన అందరికి థాంక్స్. మిక్కి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. రెజీనాతో ఇది నా రెండవ సినిమా. తనతో కలిసి వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాను.. అని చెప్పాను.

రామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ సినిమాతో బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగింది. హరీష్ గారితో ఇది నా రెండో మూవీ. అమెరికాలో షూట్ చేసిన విజువల్స్ అన్ని బాగా వచ్చాయి. తేజు అంటే నాకు చాలా ఇష్టం. తనను ప్రేమిస్తూ ఈ సినిమా చేశాను. అందరూ కష్టపడి ఈ చిత్రానికి పని చేసారు. హరీష్ గారితో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.

సతీష్ వేగ్నేశ మాట్లాడుతూ.. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే కు మంచి పేరు వస్తుంది. దానికి కారణం హరీష్ గారే. తేజు కి ఇది మూడో సినిమా అయినా ముప్పై సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్నట్లుగా నటించాడు. మా చిత్రాన్ని ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు.. అని చెప్పారు.

చంద్రబోస్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో మంచి పాట రాసే అవకాశం ఇచ్చిన హరీష్ గారికి, దిల్ రాజు గారికి, మిక్కి కి థాంక్స్. హరీష్ శంకర్ గారి సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తనలో మాటల తాత్వీకుడు ఉన్నాడు. చిత్ర బృందానికి నా అభినందనలు.. అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో హర్షిత్, శిరీష్, భాస్కర్ భట్ల, శాస్త్రి, తోటప్రసాద్, రావు రమేష్, ప్రభాస్ శ్రీను, చిట్టి, రణధీర్, గిరి, సుమన్ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ