Advertisement

చీకటి రాజ్యం ట్రైలర్ విడుదల!

Mon 28th Sep 2015 05:58 AM
cheekati rajyam,kamal hassan,madhushalini,rajesh  చీకటి రాజ్యం ట్రైలర్ విడుదల!
చీకటి రాజ్యం ట్రైలర్ విడుదల!
Advertisement

లోకనాయకుడు కమల్ హాసన్, త్రిష జంటగా రాజేష్ ఎమ్ సెల్వ దర్శకత్వంలో ఎన్.చంద్రహాసన్ నిర్మాతగా చేస్తున్న చిత్రం చీకటి రాజ్యం. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ సందర్భంగా.. 

అబ్బూరి రవి మాట్లాడుతూ.. కమల్ హాసన్ గారు నేరుగా తెలుగులో సినిమా చేస్తున్నారని అనౌన్స్ చేసినప్పుడు ఎవరు నమ్మలేదు. కాని ఈరోజు చేసి చూపించారు. ఈ సినిమాలో కమల్ గారు తండ్రిగా, భర్తగా, పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. కథ మీద నడిచే చిత్రమిది. సినిమా మొదలయిన పది నిమిషాల నుండి స్టొరీ థ్రిల్లింగ్ గా సాగుతుంది. మంచి యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆయనతో పని చేయాలనే కల ఈ సినిమాతో నెరవేరుతుంది. డైరెక్టర్ రాజేష్ ప్రతి ఫ్రేమ్, షాట్ పక్కా ప్లాన్ తో డిజైన్ చేసారు. ఇదొక క్లీన్ సినిమా. ఎక్కడా కన్ఫ్యూజన్స్ ఉండవు. హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రముంటుంది.. అని చెప్పారు.

రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. ఉత్తమ విలన్ సినిమా ప్రమోషన్స్ టైంలో తెలుగులో నేరుగా సినిమా చేస్తానని కమల్ గారు చెప్పారు. అధిక శాతం చిత్రీకరణ హైదరాబాద్ లోనే జరిగింది. కమల్ గారు నటించిన ఆకలి రాజ్యం పెద్ద సక్సెస్ అయింది. దాని తరహాలో చీకటి రాజ్యం అనే టైటిల్ కమల్ గారు ఎంతో మక్కువతో పెట్టుకున్నారు. ఇదొక ఎంగేజింగ్ థ్రిల్లింగ్ మూవీ. డైరెక్టర్ రాజేష్ కు ఈ సినిమాతో మంచి సక్సెస్ రావాలి. ఈ చిత్రంలో ప్రమోషనల్ సాంగ్ ఒకటి మాత్రమే ఉంది. ఒక సన్నివేశంలో కమల్ గారితో కలిసి నటించే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది.. అని చెప్పారు.

మధుశాలిని మాట్లాడుతూ.. కమల్ సర్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం నాకు రావడం అద్రుష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజేష్ గారికి థాంక్స్.. అని చెప్పారు.

డైరెక్టర్ రాజేష్ మాట్లాడుతూ.. చీకటి రాజ్యం చిత్రానికి దర్శకుడ్ని అని చెప్పుకోవడం కంటే విశ్వరూపం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్పడానికి గర్వపడతాను. ఇదొక ఎంగేజింగ్ థ్రిల్లింగ్ మూవీ. ఫ్రెష్ స్టొరీ.. అని చెప్పారు.

కమల్ హాసన్ మాట్లాడుతూ.. తెలుగులో నేరుగా సినిమా చేస్తానని ప్రేక్షకులకు మాటిచ్చాను. నేను  నేషనల్ స్టార్ అవ్వడం తెలుగు ఇండస్ట్రీ నుండే మొదలయ్యింది. ఈ సినిమా స్టొరీ సంవత్సరం నుండి నా మైండ్ లో తిరుగుతుంది. ఆర్డినరీ ఫిలిం కాదు. రాజేష్ ఈ సినిమాకు డైరెక్ట్ చేస్తాడని అతనికి తెలియకుండానే నాతో కలిసి పని చేస్తూ ఉండేవాడు. సుమారుగా ఏడున్నర సంవత్సరాలుగా తను నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. నేను డైరెక్టర్ గా చేయగలనని కన్విన్స్ అవ్వడానికి 27 సంవత్సరాలు పట్టింది. దాంతో పోలిస్త్ రాజేష్ తొందరగానే డైరెక్టర్ అయ్యాడు. సినిమాలో పాటలు లేవు కాని మంచి మ్యూజిక్ ఉంది. ట్రెమండస్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఇలాంటి యాక్షన్ సీన్స్ మరే సినిమాలో చూడలేదు. నవంబర్ లో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. నా తదుపరి చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుంది.. అని చెప్పారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement