మహానటుడు అక్కినేని మనవడు, కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని ని హీరోగా పరిచయం చేస్తూ సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి సమర్పణలో యూత్‌స్టార్ నితిన్ నిర్మిస్తున్న భారీ చిత్రం అఖిల్. ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 25 నుంచి అమెరికాలోని మూడు ప్రాంతాల్లో అఖిల్ ఆడియో రిలీజ్ ఫంక్షన్స్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదట శాన్ ఫ్రాన్సిస్కోలో పలువురు ప్రముఖులు, అభిమానుల సమక్షంలో ఆడియో రిలీజ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎన్.సుధాకర్‌రెడ్డి, రచయిత, దర్శకుడు కృష్ణచైతన్యలతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి వెలిగొండ శ్రీనివాస్, కోన వెంకట్, అనూప్, థమన్, అమోల్ రాథోడ్, రవివర్మ, ఎ.ఎస్.ప్రకాష్, గౌతంరాజు, భాస్కరభట్ల, కృష్ణచైతన్య, శేఖర్, గణేష్, జాని సాంకేతిక నిపుణులు.
ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్), సమర్పణ: నిఖితారెడ్డి, నిర్మాత: నితిన్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.